అమ్మ: గర్భిణులు అరటి పండు తినొద్దంట.. ఎందుకో తెలుసా..?

frame అమ్మ: గర్భిణులు అరటి పండు తినొద్దంట.. ఎందుకో తెలుసా..?

N.ANJI
గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఆహారం నియమాలు చాలా ప్రత్యేకమైనవి. కొన్ని రకాల ఆహారాలు తింటే కడుపులో ఉండే బిడ్డకు సమస్య ఏర్పడుతుంది. అందుకే ఇంట్లోని పెద్దలు కొన్ని రకాల ఫుడ్స్ అసలు తీసుకోవద్దని కఠిన నియమాలు అమలు చేస్తారు. రోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎలా తీసుకుంటారో.. గర్భిణిగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఫుడ్స్‌ను అవాయిడ్ చేయాలంటారు.

ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ హెచ్చరిస్తారు. అయితే గర్భిణీకి పుట్టబోయే పిల్లాడు, ఆరోగ్యంగా ఉండేందుకు.. తెలుపు రంగులో పుట్టేందుకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుంటారు. అలాగే ఆ సమయంలో గర్భిణులకు శక్తి చాలా అవసరం. అందుకే ఫ్రూట్స్, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పాలు వంటివి ఆహారంలో ఉండేలా చూసుకుంటారు.
అయితే గర్భిణులు అరటిపండ్లు తినకూడదు. ఎందుకంటే వీటిని తినడం వల్ల కడుపులో ఉండే బిడ్డకు దగ్గు, జలుబు వంటి వ్యాధులు వస్తాయి. అలాగే చేపలను తినడానికి కూడా పెద్దలు నిరాకరిస్తారు. చేపలు తినడం వల్ల బిడ్డ శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అందుకే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తినాలని, గర్భిణీగా ఉన్న సమయంలో తల్లి తినే ఆహారం బిడ్డకు వెళ్తుంది. బిడ్డ ఆరోగ్యానికి అనుగుణంగా ఆహారాన్ని తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
గర్భిణులు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. తొందరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకునే అలవాటు చేసుకోవాలి. ఆహారంలో తప్పనిసరిగా విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. డెలివరీ చివరి మూడు నెలల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్‌కు సంబంధించిన టాబ్లెట్లను వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణుల రక్తం చాలా వరకు క్షీణిస్తుంది. ఆ సమయంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటుందని, అందుకే ఈ టాబ్లెట్లు వేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

విటమిన్ల లోపం ఏర్పడితే పుట్టే పిల్లాడికి పెదాలు పగలడం, తలపై కురుపులు ఏర్పడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే.. ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. రోజువారీ ఆహారంలో పుప్పుదినుసులు, బియ్యం, కూరగాయలు, రొట్టెలు, పండ్లు, పాలు, మాంసం ఉండేలా చూసుకోవాలి. దీంతో గర్భిణులకు శక్తి లభిస్తుంది. పుట్టే పిల్లాడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: