అక్క సినిమాలో చెల్లెలు ఆర్మీ లో సినిమాల్లో చేయడం పై ఎందుకింత చిన్నచూపు
సినిమా ఇదొక వింత ప్రపంచం. మనం పాత కాలంలో కుటుంబం తో కలిసి వచ్చి సినిమాలని చూసేవాళ్లు అప్పుడు ఉండే సినిమాలు మనకి కనెక్ట్ అయ్యేవి. అప్పుడు సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ ఏడిచే సన్నివేశాల్లో నటిస్తే ప్రేక్షకులు కూడా కంటతడిపెట్టేవాళ్ళు. అంతలా సినిమాలు ప్రేక్షకుల మనసులు హత్తుకునేవి. కానీ ఇప్పుడు సినిమా చూస్తే ఏడుపు కాదు కదా నవ్వు తెప్పించే సీన్లలో కూడా నవ్వు రావడం లేదు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఎక్కువ కనెక్ట్ కావడం లేదు. అంతేకాకూండా అడల్ట్ కంటెంట్, అసభ్య పదజాలం, మితిమీరిన రొమాన్స్ ఎక్కువవడం వల్ల సినిమాలు, సినిమాల్లో నటించే వారిపై ఒక అభిప్రాయం వచ్చేసింది.
ఇప్పుడు సినిమాల్లో నటించే వారిని చిన్నచూపుగా చూస్తున్నారు. ఆమె నటించిన సినిమాల కంటే ఆమె వ్యక్తిగత విషయాలపై చర్చలు పెట్టడం ఎక్కువయింది. వాళ్ళు ఏ కథలు చేయాలి, ఎలా నటించాలి అనేది మనం నిర్ణయిస్తున్నాం. ఆమెకు ఒక సోదరి ఉంటె తను ఇటు వైపు రాకుండా వేరే వృత్తిలో రాణిస్తుందంటే ఆమెనే మెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇలాంటి విషయాలే ట్రెండీ అవుతున్నాయి. మీ చెల్లిని చూసైనా నేర్చుకోండి అంటూ నెటిజన్లు హితబోధ చేస్తున్నారు. ఇప్పుడు అచ్చం ఇలాంటిదే ఒకటి జరిగింది దాని గురించి ఇప్పుడు మీకు చెప్పాలి. ఇక విషయంలోకి వెళ్తే,
తెలుగులో వరుణ్ తేజ్ తో నటించిన హీరోయిన్ దిశా పాటని. బాలీవుడ్ లోను హీరోయిన్ గా కొనసాగుతుంది . అయితే దిశా పటానికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు ఖుష్బూ పటాని. ఈమె ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేస్తోంది ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చింది. ఇక అప్పటినుంచి ఇద్దరికీ పోలిక చూడటం మొదలుపెట్టారు. దీనిని ఒక సాకుగా చూపి దిశా పటానిని పై ట్రోలింగ్ చేస్తున్నారు. అక్క సినిమాల్లో, సోదరి ఆర్మీలో ఎవరికీ నచ్చిన వృత్తి లో వాళ్ళు కొనసాగుతున్నారు. ఇప్పుడు చెప్పండి ఆర్మీ లో చేయడం అంటే చాలా గొప్ప విషయం. కానీ సినిమాల్లో చేసినందుకు దిశాని ట్రోలింగ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ మీరే చెప్పాలి.