అమ్మ: కవలలు ఎందుకు పుడతారో తెలుసా..!?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే చాల మందికి కవల పిల్లలు పుట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే కవల పిల్లలు ఎందుకు పుడతారు ..? కవలలు పుట్టాలంటే తల్లిదండ్రులు చేయాల్సిందేమైనా ఉందా ..? కవలలు పుట్టే అవకాశాలు మెరుగుపరుచుకోవడం ఏలా..? వంటి ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతుంటాయి. ఎటువంటి దంపతులకు క‌వ‌ల పిల్ల‌లు పుడ‌తారు అనే విషయమై నిపుణులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు.
చాల మంది కవలలకు జన్మనివ్వడంలో జీన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే.. మీ వంశంలో ఇంతక ముందు ఎవరైనా కవలలకు జన్మనిచ్చి ఉంటే.. మీకూ ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులిద్దరి వంశాల్లో ‘ట్విన్స్ హిస్టరీ’ ఉంటే కవలలకు జన్మనిచ్చే అవకాశం మరింత పెరుగుతుందట.
అయితే పెళ్లయిన చాలా ఏళ్ల వరకు పిల్లలు పుట్టని మహిళలు వైద్యులను సంప్రదించి కొన్ని మందులు వాడుతుంటారు. ఇటువంటి సమయంలో ఆ మందుల ప్రభావం వల్ల కొన్నిసారు ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయట. తద్వారా కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. పాల ఉత్పత్తులు, చేపలు వంటి పోషకాలుండే ఆహారం తీసుకునే వారికి ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువని ఆస్ట్రేలియలోని ఓ ప్రసిద్ధ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. గర్భధారణ సమయంలో మల్టీ విటమిన్ల ట్యాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను అధికంగా తీసుకున్న వారిలో ఎక్కువ మందికి కవల పిల్లలే పుట్టారని ఓ అధ్యయనం ద్వారా బయటపడింది.
ఇక కవలలు రూపంలో ఒకేలా ఉంటారు. కానీ.. వారి ఫింగర్ ప్రింట్స్, కళ్లు మాత్రమే వేరేలా ఉంటాయి. కొంతమంది ట్విన్స్ ముఖ కవలికలు ఒకేలా ఉన్నా శారీరక బరువు వేర్వేరుగా ఉంటుంది. కవలల ఆకృతి మాత్రమే ఒకేలా ఉంటాయి.. వారి ఆలోచనలు ఒకేలా ఉండవు. కొందరు ట్విన్స్‌లో ఒకరు ఆరోగ్యంగా ఉంటే మరొకరు వీక్‌గా ఉంటారు. అలాగే.. ఇద్దరిలో రోగ నిరోధక శక్తుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: