అమ్మ: గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..!?
అయితే గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావాల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత వహించాలి. బాగా ఉడికిన గుడ్లను మాత్రమే తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమన్స్ మాంసాహారం తక్కువగా తినేవారైనా లేదా మాంసాహారం ఇష్టం లేకపోయినా దానికి బదులుగా బీన్స్, కాయ ధాన్యాలను తినడం ఉత్తమం. వీటిలో సమృద్ధిగా ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్స్, ఫోలేట్, కాల్షియం ఉండటం వలన గర్భవతుల ఆరోగ్యానికి సహకరించడంతో పాటు, వారి కడుపులో ఉన్న బిడ్డ బరువు పెరిగేందుకు బాగా ఉపయోగపడతాయి.
అదే మాంసాహారులైతే గుడ్లు తినడం వల్ల గర్భంలో ఉండే శిశువు మెదడుకి కావలసిన కోలిన్ ను పొందొచ్చు. తాజా కూరగాయలు, పండ్లు, పండ్లరసాలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు మొదలైన వాటిలో గర్భిణులకు కావలసిన పోషకాలు లభ్యమవుతాయి. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల పుట్టబోయే పిల్లల్లో వెన్నెముకకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. దంపుడు బియ్యం, ఆకుకూరలను తీసుకోవడం ద్వారా ఫోలిక్ యాసిడ్‌ను ఎక్కువ మోతాదులో పొందొచ్చు. తద్వారా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.
చిలకడదుంపలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. మన శరీరం బీటా కెరోటిన్‌ను గర్భంలో పిండం ఎదగడానికి ఉపయోగపడే ‘విటమిన్ A’గా మారుస్తుంది. రోజూ 100-150 గ్రాముల చిలకడదుంప తీసుకోవడం వల్ల.. శరీరంలో ‘విటమిన్ A’శాతాన్ని 10 నుంచి 40 శాతం పెంచుతుంది. చిలకడ దుంపలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. రక్తంలో చక్కర శాతాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.