అమ్మ: గర్భిణులు పారాసిటమాల్ ట్యాబ్లెట్‌తో జాగ్రత్త సుమీ..!

N.ANJI
ప్రతి మహిళ అమ్మ అని పిలిపించుకోవాలని చాల కలలు కంటుంటారు. గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తగా ఉండాలి. వారి తీసుకునే ఆహారం, జాగ్రత్తలు మీదనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇక గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఒత్తిళ్లకు, ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఇక గర్భం దాల్చిన వారు పారాసిటమాల్ మాత్రలు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీని ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటున్నట్లు గుర్తించారు.
అయితే చాల మంది గర్భిణులు కొంచెం జ్వరం, ఒళ్లునొప్పులుగా అనిపిస్తే వెంటనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం. కానీ ప్రెగ్నెన్సీ టైంలో పారాసిటమాల్ వాడొద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ ప్రభావం వల్ల పుట్టబోయే ఆడబిడ్డలో సంతాన సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇక పాప పెరిగి పెద్దయ్యాక.. పునరుత్పత్తి మీద దాని ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పారాసిటమాల్, ఎసిటమినోఫెన్ లాంటి ట్యాబెట్లను ప్రపంచ వ్యాప్తంగా గర్భిణులు కామన్ ‌గా వాడుతున్నారు.
ఇక పునరుత్పత్తి కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే ఆడవారిలో అండాలు ఉత్పత్తి అవుతాయని వారి పరిశోధనలో తేలినట్లు చెప్పారు. పుట్టుకతోనే మనుషులు, ఎలుకల్లో అండాల సంఖ్య విషయంలో పరిమితి ఉంటుంది. గర్భిణులు నొప్పి నుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్ మాత్రలు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలో అండాల సంఖ్య తగ్గుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
దీని ఫలితంగా యుక్త వయసులోకి వచ్చాక వారిలో సంతానోత్పత్తి కోసం కొన్ని అండాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీని వల్ల పునరుత్పత్తి అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య అధికం అవుతుంది. గర్భిణులపై పారాసిటమాల్ ప్రభావంపై మూడు ల్యాబోరేటరీల్లో పరిశోధనలు చేపట్టారు. ఈ విషయమై మరింత లోతుగా రీసెర్చే చేయాల్సిన అవసరం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన క్రిస్టెన్‌సేన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: