అమ్మాయిలూ.. ఈ ఆహారాన్ని మాత్రం కచ్చితంగా తీసుకోండి

P.Phanindra
మగవారితో పోల్చితే ఆడవారికి ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడం అవసరం. మహిళల శరీర పనితీరు సక్రమంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను వారు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఆహారాలను ఒకసారి చూద్దాం:
పాలకూర:
పాలకూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. మహిళల్లో కూడా చాలా మంది పాలకూర తినడానికి విముఖత చూపుతారు. కానీ.. పాలకూర మహిళలకు ఎంతో అవసరం అని చెబుతున్నారు. పాలకూరలోని మెగ్నీషియం.. మహిళల పీఎమ్ఎస్ లక్షణాలను అడ్డుకుంటుందని తెలుసా? అంతేకాదండోయ్.. పాలకూర ఎముకల పటుత్వానికి, ఆస్తమా రాకుండా ఉండేందుకు, రక్తపోటు నియంత్రించేందుకు కూడా పాలకూరలోని పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకని పాలకూర తప్పకుండా తినాల్సిన అవసరం ఉంది
క్రాన్ బెర్రీస్ :
మహిళల్లో తరచూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు క్రాన్ బెర్రీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
టొమాటో :
టొమాటోలోని లెకోపీన్ అనే పిగ్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఎంత మందికి తెలుసు? అంతేకాదు టొమాటో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఓట్స్ :
గుండెతో పాటు జీర్ణ క్రియను ఓట్స్ మెరుగు పరుస్తాయి. లావెక్కుతారన్న భయం కూడా ఉండదు. బరువు అదుపులో ఉంటూనే ఉంటుంది.. రోజూ తింటూనే ఉండొచ్చు. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల కలిగే భావోద్వేగాలను కూడా ఓట్స్ నియంత్రిస్తాయి.
అవిసె గింజలు
అవిసె గింజలు మార్కెట్లో చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. పైగా అవిసె గింజలు గుండెకు ఎంతో మంచిది. వాపును, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. స్త్రీలు రోజూ అవిసె గింజలను తినడం ఎంతో మంచిది. మల బద్దకం సమస్య నుంచి అవిసె గింజలు బయట పడేస్తాయి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫాటీ అమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: