అమ్మ: గర్భధారణ సమయంలో ఇలా ఉంటే.. మీ ప్రాబ్లమ్ సాల్వ్..!?
ఇక ప్రెగ్నెంట్ అని చెప్పాలనుకోకపోతే ముందుగా లూజ్ గా ఉండే బట్టలు ధరించడం మంచిది. పొట్ట దగ్గర కొంచెం లూజ్‌గా ఉండే టాప్ వేసుకున్నా, బాటమ్ మాత్రం సరిగ్గా సరిపోయేదే వేసుకోవాలి. అలాగే స్కార్ఫ్ వేసుకోవడం.. లేదా జ్యూవలరీ వేసుకోవడం వల్ల అటెన్షన్‌ని డిస్ట్రాక్ట్ చేయవచ్చు. బ్రైట్ కలర్స్ తో ఉండే స్కార్వ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇందుకు బాగా పనికొస్తాయి. కొద్దిగా వచ్చిన పొట్టని కనిపించకుండా చేస్తుంది.
అంతేకాదు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మాటిమాటికీ బాత్రూంకి వెళ్లి రావడం, వికారంగా ఉండడం లాంటివి జరుగుతాయి. అలాంటివి చెప్పకపోయినా పక్క వాళ్లకి విషయం పట్టిచ్చేస్తాయి. దీన్ని అవాయిడ్ చేయడానికి పెప్పర్మింట్, టీ తాగడం, క్రాకర్స్ తినడం వంటివి హెల్ప్ చేస్తాయి. మీ ప్రెగ్నెన్సీని దాయడానికి మీరు డీ టాక్స్ డైట్‌లో ఉన్నారని చెప్పడం కూడా ఒక పద్ధతి.
అయితే గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటిని బయటకి కనబడనీయకుండా దాచడం దాదాపు అసాధ్యం. ఇక ఇరిటేషన్, చిరాకు, కోపం, ఏడుపు వంటివి ప్రెగ్నెంట్స్ అందరూ కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అలాంటి సమయంలో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల బాగా ఒత్తిడికి గురవుతున్నానని చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో చాలామంది మహిళలకు ఇలాంటి విషయాలపై అవగాహన ఉండదు. అలాంటి వాళ్లకు తెలిసేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.