అమ్మ: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో..!
గర్భధారణ సమయంలో నిమ్మరసం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గర్భిణీలు నిమ్మరసాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇతర సప్లిమెంట్స్ మీద ఆధారపడకుండా రెగ్యులర్ గా లెమన్ జ్యూస్ ను తీసుకోవచ్చు. అంతేకాదు సాధారణంగా, గర్భిణీ స్త్రీలు, మలబద్దకంతో బాధపడుతంటారు. అయితే నిమ్మరసం త్రాగడం వల్ల, కాలేయంను క్రమబద్దం చేస్తుంది. ఇది డయోరియా, మలబద్దం వంటి సమస్యలను నివారిస్తుంది. లెమన్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకొన్నప్పుడు బౌల్ మూమెంట్ సులభం అవుతుంది.
లెమన్ జ్యూస్ గర్భిణీ స్త్రీల శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల దీన్ని మంచి క్లెన్సర్ గా ఉపయోగిస్తున్నారు . ఇది శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది. శరీరంను శుభ్రం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు కొన్ని ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
కొన్ని పరిశోధనల ద్వారా లెమన్ జ్యూస్ పొట్టలో పెరిగే శిశువుకు కూడా చాలా మంచిదని నిర్ధారించడం జరిగినది. నిమ్మరసంలో పొటాషియం ఉంటుంది. ఇది శిశువులో ఎముకలు పెరుగుదలకు అవసరం అవుతుంది. అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట కూడా చాలా సహాయపడుతుంది. నిమ్మరసం అజీర్తి నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది . గర్భిణీ స్త్రీలకు ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.