అమ్మ: గర్భం పండాలంటే ఇవి తప్పని తీసుకోవాలి..!

N.ANJI
పండంటి బిడ్డకు జన్మనివ్వాలని అందరు ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఇక పండంటి బిడ్డను కోరుకుంటే గర్భం దాల్చకముందు నుంచే పోషాకాహారం తీసుకోవాలన్నది వైద్యులు సూచిస్తున్నారు. పోషకాహారం గర్భధారణను నిర్దేశిస్తుంది. ఇక గర్భం దాల్చిన తర్వాత కూడా ఇది అవసరమే. గర్భంలో ఉన్న పిండం ఆరోగ్యకరమైన శిశువుగా రూపాంతరం చెందేందుకు, చక్కని ఎదుగుదలకు పోషకాహారం చాలా ముఖ్యం అని వైద్యులు తెలియజేస్తున్నారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి అవకాశమివ్వకుండా కడుపు పండిన ప్రతీ మహిళ తప్పనిసరిగా చక్కని ఆహారంపై దృష్టి పెట్టాలి. ఇందుకు పోషకాహార నిపుణులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం. గర్భం దాల్చడానికి ఐరన్ చాలా చాలా అవసరం. సాధారణంగా మన శరీరానికి అవసరమైన దాని కంటే గర్భం దాల్చిన తర్వాత రెట్టింపు ఐరన్ కావాలి. ఎందుకంటే కణాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది. బిడ్డ ఎదగడానికి కణ నిర్మాణం చాలా కీలకం. గర్భంతో ఉన్నప్పుడు శారీరకపరమైన ఎన్నో మార్పులకు ఐరన్ సాయపడుతుంది.
ఇక ఐరన్ పాలకూర, క్యాలీఫ్లవర్, గుమ్మడికాయ, టమాటాలు, బీట్ రూట్, మష్ రూమ్స్, బీన్స్, పప్పు ధాన్యాలు, పుచ్చకాయ, ద్రాక్ష, కమలా, నారింజ, యాపిల్స్, స్ట్రాబెర్రీ, ముడి ధాన్యాల్లో ఐరన్ తగినంత లభిస్తుంది. మాంసాహారమైన చికెన్, మటన్ లోనూ ఐరన్ లభిస్తుంది. అందుకోసం విటమిన్ సీ సప్లిమెంట్లను తీసుకోవాలి. దీంతో ఐరన్ ను శరీరం తేలిగ్గా గ్రహించగలదు.
అంతేకాదు ఫోలిక్ యాసిడ్ అన్నా ఫొలేట్ అన్నా ఒకటే. ఇది బి గ్రూపు విటమిన్. తల్లి కావాలనుకునే ప్రతి మహిళకూ అత్యంత అవసరమైన విటమిన్. గర్భంలో శిశువు ఎదుగుదలకు ఇది అత్యంత కీలకమైనది. వెన్నుపాము, మెదడుకు సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాలను ఇది నివారించగలదు. ప్రొటీన్లు కూడా కణాల నిర్మాణానికి అవసరమే. రెండు, మూడు త్రైమాసికాల్లో దీన్ని తీసుకోవడం తప్పనిసరి. అంటే నాలుగో నెల నుంచి ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్లు, పాలు, పాల పదార్థాలు, బీన్స్ లో ఎక్కువగా ప్రొటీన్ లభ్యమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: