అమ్మ : గర్భిణీ స్త్రీలు చేపలు తింటే ఏమవుతుందో తెలుసుకోండి.. !

Suma Kallamadi
అమ్మ అనే పిలుపు కోసం ప్రతి మహిళ ఎదురుచూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పిలుపులోని మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. గర్భవతి అయిన దగ్గర నుండి కడుపులోని బిడ్డ కోసమే తాపత్రయపడుతుంది . కడుపులోని బిడ్డ క్షేమం కోసం ఎన్ని బాధలు అయిన భరిస్తుంది. అయితే ఈ సమయంలోనే ఆడవాళ్లు  తీసుకునే ఆహారం పిల్లల్లో శారీరక అవయవాలు ఏర్పడడానికి, అలాగే మెదడు సామర్థ్యం పెరగడానికి దోహదం చేస్తుంది. అందుకే గర్భంతో ఉన్నప్పుడు కాబోయే అమ్మలు ఏమేమి తినాలి, ఏయే పదార్థాలకు దూరంగా ఉండాలో ఓ పెద్ద లిస్టు చెబుతుంటారు మన పెద్దలు. 





అయితే గర్భవతి తినే ఆహారంలో చేపలు చాలా ముఖ్యమైనవి అంట. గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింటే  బాగా తెలివైన పిల్లలు పుడతారని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. గర్భవతులు వారానికి ఒకసారయినా చేపలను తింటే వారికి పుట్టే పిల్లలు అత్యంత తెలివితేటలతో ఉంటారని ఆ అధ్యయనం తేల్చింది. సగటున వారానికి ఓసారయినా చేపలను తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల తెలివితేటలు (ఐక్యూ) ఎక్కువగా ఉంటాయట . అలాగే  చేపలను తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఆరోగ్యపరగా ఎంతో మేలు జరుగుతుంది. చేపలు ఎక్కువగా తింటే ఆటిజం వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. 




అలాగే చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చేపలలో కొవ్వు నూనెలు తక్కువగా ఉంటాయి కనుక తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిదే. మాంసాహారులైతే కాబోయే తల్లులు ప్రతి వారం క్రమం తప్పకుండా చేపలు తింటే మంచి ప్రతిభ కూడిన పిల్లలు పుడతారన్నమాట.గర్భవతిగా ఉన్నప్పుడు, మీరు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలతో పోషకాలు అధికంగా ఉన్న చేపలను తినవచ్చు, కాని అధిక స్థాయిలో పాదరసం కలిగిన చేపలను తినడం మంచిది కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: