బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి పెళ్లయిన స్త్రీకి ఉంటుంది. తమ ప్రేమానుబంధానికి, ఆత్మీయతకు గుర్తుగా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఉండాలనే కోరుకుంటారు. అంతేకాదు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కూడా ఆశిస్తారు. కానీ కొంతమందికి పెళ్లి అయ్యి ఎన్ని రోజులు అయినాగానీ సంతానం కలగరు. అందుకనే పిల్లలను కనేందుకు ఇతరత్రా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కింద ఇచ్చిన కొన్ని టిప్ప్ పాటిస్తే వారికి పిల్లలు వెంటనే పుట్టే అవకాశం ఉంది. పూర్తిగా సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను తినడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది
ముందుగా శెనగలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడకబెట్టికానీ, కూరల్లో వేసుకుని గానీ నిత్యం తింటుంటే మహిళల్లో అండాశయాల పనితీరు మెరుగుపడుతుంది. ఇది చక్కని రుతు క్రమాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో పిల్లలు త్వరగా కలిగే అవకాశం ఉంది. అలాగే దానిమ్మలో ప్రత్యుత్పత్తి పని తీరును మెరుగుపర్చే ఎన్నోపోషకాలు ఉన్నాయి. ఈ పండ్లను నిత్యం తినడం వల్ల మహిళల్లో గర్భాశయానికి రక్త సరఫరా పెరుగుతుంది. ఇది రుతుక్రమం సరిగ్గా జరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాదు దానిమ్మలు తింటే పురుషుల్లో వీర్యకణాల కౌంట్ పెరుగుతుంది. దీంతో పిల్లలను త్వరగా కనేందుకు అవకాశం ఏర్పడుతుంది.
అంతేకాకుండా ఆకు పచ్చగా ఉండే కూరగాయలు, ఆకు కూరలతో దంపతులకు కావల్సిన పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఇవి వారిలోని హార్మోన్ అసమతుల్యతలను పోగొడతాయి. మహిళల్లో ప్రధాన సమస్యలైన ఐరన్,ఫోలిక్ యాసిడ్ లను పెంచుతాయి. దీని వల్ల గర్బం కలిగే అవకాశాలు మెరుగవుతాయి.
అంతేకాకుండా గర్భ దారణ అనంతరం కూడా మహిళలు ఇలాంటి కూరగాయలు తింటుంటే శిశువు చక్కగా ఎదుగుతుంది.అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల స్త్రీలల్లో రుతుక్రమ సమస్య తొలగిపోతుంది. పీరియడ్స్ సరిగ్గా వస్తాయి. దీంతో పిల్లలు కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి కాయ విత్తనాలు మనకు బయట మార్కెట్ లో లభిస్తాయి. వీటిని నిత్యం తింటుంటే ఐరన్ సమృద్ధిగా అందుతుంది. దాని వల్ల రక్తం పెరగడంతో పాటుగా లైంగిక పటుత్వం కూడా పెరుగుతుంది. ఇది పిల్లలను త్వరగా కనేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దంపతులు పనీర్ ను ఎక్కువగా తీసుకుంటున్నా స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. దీంతో పిల్లలు వెంటనే పుడతారు. బ్రకోలి తినడం కూడా మంచిదే. కానీ ఇవి ఎక్కడపడితే అక్కడ దొరకవు. పెద్ద సూపర్ మార్కెట్లలో మాత్రమే లభిస్తాయి. దీన్ని తెచ్చుకుని కూర చేసుకుని తింటుంటే ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఐరన్ మెండుగా దొరుకుతాయి. ఇవి శరీరంలో ఉన్న అసమతుల్యతను పోగొట్టి ప్రత్యుత్పత్తి అవయవాలను సక్రమంగా పనిచేయించేలా చేస్తాయి.