అమ్మ : గర్భవతి బిడ్డను ప్రసవించే అప్పుడు పురిటినొప్పులు ఎంత సమయం ఉంటాయో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
గర్భవతి అయిన ప్రతి మహిళ పురిటి నొప్పులు అనుభవించే ఉంటుంది. కానీ ఈ కాలంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా ప్రసవ నొప్పులు అనేవి లేకుండా మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసి ప్రసవం చేస్తున్నారు. అయితే  ఎక్కువమంది మహిళలు నొప్పులు కన్నా ఆపరేషన్ చేయించుకోవడమే ఉత్తమం అని భావిస్తున్నారు.. కొంతమంది మాత్రం నార్మల్ డెలివరీ కి ప్రాముఖ్యత ఇస్తున్నారు.. అయితే చాలా మందికి ప్రసవ నొప్పులు ఎన్ని గంటలు వస్తాయి, ఎన్ని రోజులు వస్తాయి అనే అనుమానం ఉంటుంది.ఇప్పుడు అలాంటి ప్రశ్నలకు సమాదానాలు తెలుసుకుందాం. ! మీ మొదటి బిడ్డ కొరకు, నొప్పులు సుమారుగా 8 గంటల సేపు ఉంటాయి. కానీ అవి చాలా తక్కువగా లేదా ఎక్కువగా కూడా ఉండవచ్చు. కానీ అవి 18 గంటలకంటే ఎక్కువ సేపు ఉండవు. మీ గర్భాశయ ద్వారం ఒకసారి పూర్తిగా తెరుచుకుంటే (మీ గర్భకోశం యొక్క ప్రవేశ ద్వారం) మీ శిశువును ముందుకు త్రోయుటకు, అది జన్మించడానికి ముందు 1 లేదా 2 గంటల సమయం పడుతుంది.

అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు తెలుసుకోవాలి.. అది ఏంటంటే  మీకు ఇదివరకే ఒక బిడ్డ ఉంటే, ఈ సారి నొప్పులు వేగంగా రావచ్చు. సాధారణంగా 5 గంటలుండవచ్చు. కానీ అవి  12 గంటలకంటే ఎక్కువసేపు ఉండవు. మీ శిశువును వెలుపలకు త్రోయబడడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. స్త్రీ యొక్క శరీర తత్వాన్ని బట్టి  ప్రసూతి నొప్పులు వేరు వేరుగా ఉంటాయి. అలాగే మీకు నొప్పులు వచ్చేటప్పుడు  వీలయినంతా నిటారుగా ఉండి, కదులుతూ  ఉండాలి, దీని వలన బిడ్డ వేగంగా జరుగుటకు వీలవుతుంది.

మీ బిడ్డ జన్మించిన తరువాత, మీ శరీరం నుండి ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఇది తరచుగా 5 నుండి 15 నిమిషాలలో జరుగుతుంది. కానీ అది ఒక్కోసారి 1 గంట కూడా పట్టవచ్చు. చాలా అరుదుగా, నొప్పులు వేగంగా వస్తాయి. పురిటి నొప్పులు మొదలయిన వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ఎట్టి పరిస్థితులలో ఇంట్లోనే ఉంచి ఏ మంత్రసానినో పిలిచి ప్రసవం చేయించడం మంచిది కాదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: