రైలులో ప్రయాణించే ఒంటరి మహిళల రక్షణకై "మేరీ సహేలీ"...

frame రైలులో ప్రయాణించే ఒంటరి మహిళల రక్షణకై "మేరీ సహేలీ"...

SS Marvels
రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు రక్షణగా ఉండేందుకు ‘మేరీ సహేలీ’(నా స్నేహితురాలు) పేరుతో ప్రత్యేక బలగాలను ఏర్పాటుచేసింది భారతీయ రైల్వే. వారి భద్రతకు ప్రత్యేక బలగాలను రైళ్లలో ఏర్పాటు చేయడం, ప్రయాణ మార్గంలో ఆర్‌పీఎఫ్‌ బలగాలు అప్రమత్తంగా ఉండేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా విశాఖ-న్యూఢి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (02805)లో శనివారం ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దశలవారీగా ఈ సేవలను ఇతర రైళ్లకూ విస్తరించనున్నారు.
మేరీ సహేలీలో బాగంగా నిర్దేశించిన రైళ్లలో మహిళా ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌ను పంపుతారు. వీరు మహిళల కోచ్‌తో పాటు ఇతర కోచ్‌లనూ పరిశీలించి ఒంటరిగా ప్రయాణించే మహిళలను గుర్తించి మాట్లాడతారు. తమ ఫోన్‌ నంబరు వారికి ఇచ్చి, ఏదైనా సమస్య ఎదురైతే 182 నంబర్‌కు, సిబ్బంది నంబర్లకు ఫోన్‌ చేసేలా అవగాహన కల్పిస్తారు. అలాగే ఆ మహిళల పేర్లు, సీటు నంబర్లు తీసుకుని, ఆ వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఏ కోచ్‌లో, ఏ సీట్లో ఒంటరిగా మహిళలు ఉన్నారు అనే సమాచారం కంట్రోల్‌రూమ్‌ ద్వారా రైలు ప్రయాణించే మార్గంలోని ఆర్‌పీఎఫ్‌ మహిళా బృందాలకు మాత్రమే తెలుస్తుంది. వేధింపులకు గురికావడం, ఇతర ఇబ్బందులున్నట్టు సమాచారం వస్తే ఆయా స్టేషన్లలో రైలు ఆగినప్పుడు ఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహకరిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More