అమ్మ : గర్భధారణ సమయంలో చేయవలిసిన, చేయకూడని పనులు.. !!

Suma Kallamadi
గర్భ నిర్దారణ పరీక్ష చేయించుకున్న తర్వాత  రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చాక  ప్రినేటల్ పరీక్షల కోసం తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.వైద్యులు సూచించినట్లుగా, మీరు గర్భధారణ నిర్ధారణ కోసం రక్త పరీక్ష, హెచ్‌సిజి పరీక్ష (hCG test) ప్రొజెస్టెరాన్ స్థాయిల పరీక్షతో  సహా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.అలాగే గర్భవతి అయిన మహిళల్లోమలబద్ధకంగా అనిపించవచ్చు కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం మంచిది.వీలయినన్ని మంచి నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు తింటూ ఉండాలి. అలాగే గర్భవతిగా ఉన్న మహిళసరైన నిద్ర అనేది పోవాలి. గర్భంతో ఉన్నపుడు కంటినిండా నిద్రపోతేనే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఇకపోతే సెక్స్ విషయానికి వస్తే
గైనకాలజిస్ట్‌ మిమ్మల్ని అనుమతించినట్లయితే మాత్రమే సెక్స్ చేయండి. మీ పిండం స్థానం ఒకవేళ కిందకి ఉన్నట్లయితే సెక్స్ చేయడం వల్ల కడుపులోని బిడ్డకు ప్రమాదం జరగవచ్చు.
గైనకాలజిస్ట్‌ సూచించినటువంటి మీ ప్రినేటల్ సప్లిమెంట్లను జాగ్రత్తగా తీసుకోండి.

వ్యాధికారక వస్తువులు, హానికర పరిసరాలకు దూరంగా ఉండండి. ఆలాగే క్రమం తప్పకుండ మందులు వేసుకుంటూ ఉండాలి . సమయానికి ఆహారం తింటూ ఉండాలి. అలాగే గర్భధారణలో  సమయంలో కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.. !!ఇద్దరి కోసం తినాలనే ఆలోచనతో అతిగా తినడం మంచిది కాదు. ఒకవేళ తినాలంటే కొంచెం గ్యాప్ తీసుకుని కొద్దీ కొద్దిగా తినాలి. అలాగే గర్భవతిధూమపానం చేయడం కూడా మంచిది కాదు. మద్యం తాగడం చేయకూడదు.

 బరువైన పనులు చేయడం, బరువు వస్తువులు మోయడం చేయకూడదు.తీవ్రమైన వ్యాయామాలు చేయవద్దు
అలాగే పచ్చి కోడిగుడ్లు, పచ్చి మాంసం తినవద్దు
కెఫిన్ ఎక్కువ తీసుకోకూడదు.డ్రగ్స్ కూడా తీసుకోకూడదు. వీటివల్ల బిడ్డకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.
గర్భధారణలో డెయిటింగ్ చేయడం, అధిక వేడి నీటి స్నానం కూడా చేయకూడదు.వైద్యుడు  సూచించని మందులు అసలు వేసుకోకూడదు. మరో ముఖ్య విషయం ఏంటంటే
అధిక ఒత్తిడికి గురికాకుండా ఉండడం. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: