అమ్మ : ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే ఇలాంటి చిట్కాలు పాటించండి.. !!

Suma Kallamadi
బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవడానికి ప్రతి తల్లి ఎదురుచూస్తుంది. కానీ కొంతమంది మహిళల్లో పెళ్లి అయ్యి చాలా రోజులు అయినాగానీ పిల్లలు పుట్టరు.తల్లి కాలేకపోతున్నామని ఎంతో  బాధపడతారు.అయితే ముందుగా తల్లి కావాలనుకునేవారికి శారీరక దృఢత్వం చాలా అవసరం.అలాగే మారుతున్న జీవనశైలి కారణంగా రోజురోజుకూ పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. భవిష్యత్తులో శరీరంపై దాని ప్రభావం, పరిస్థితి భయంకరమైనదిగా మారుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి తల్లి కావడానికి మీ శరీరాన్ని అనుకూలంగా మార్చాలి. శారీరక సామర్ధ్యానికి సహాయపడే అనేక చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొదట మీరు మీ శరీరంలో ఉన్న అన్ని పరాన్నజీవులను చంపాలి. దీన్ని ఎలా చేయాలంటే ప్రతి రోజు వెల్లుల్లి,  లవంగాన్ని తినండి. అప్పుడు మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే మీ శరీరం కూడా  వ్యాధులను తట్టుకునేలా మారుతుంది. అలాగే గర్భాశయ శ్లేష్మం ఎలా మెరుగుపరచాలో మీ వైద్యుడితో మాట్లాడండి. ఈ సందర్భంలో విటమిన్-ఎ సప్లిమెంట్ తీసుకోవడం చాలా మంచిది.అంతేకాదు మీ వైద్యుడిని సంప్రదించి జింక్ సప్లిమెంట్ తీసుకోమని మీ భర్తను అడగండి. ఇలా జింక్ సప్లిమెంట్ అనేది తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరగడానికి  సహాయపడుతుంది.
నియమం ప్రకారం ప్రతి రోజు హెర్బల్ టీ తాగండి. మీ జీర్ణ సామర్థ్యంపై నిఘా ఉంచండి. అంతేకాదు మీరు ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజూ యోగా చేయండి. అలాగే ప్రెగ్నెన్సీ రావాలంటే ముందుగా ఆరోగ్యకరమైన అండం అనేది ఉండాలి. అందుకనే ఆడవాళ్ళ అండోత్సర్గ చక్రం సరిగ్గా ఉండటానికి ప్రతిరోజూ ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు, చేపలను తినాలి. అలాగే వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. ముందుగా ఆడవాళ్లు ఎక్కువ బరువు కనక ఉన్నట్లయితే బరువు తగ్గడం అనేది చాలా ముఖ్యం. అధిక బరువు కూడా ప్రెగ్నన్సీ రాకపోవడానికి ఒక కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: