ఆడవాళ్లు నడుము నాజూగ్గా అవ్వాలంటే మెంతులతో ఇలా చేస్తే సరి.. !!

Suma Kallamadi
ఆడవాళ్ళ అందాన్ని డామినేషన్ చేసేది ఓవర్ వెయిట్. ఇప్పటి కాలంలో చాలామంది ఆడవాళ్లు ఎదుర్కునే ప్రధాన సమస్య బరువు పెరగడం. అలాగే ఈ కొవ్వు అనేది ఎక్కువగా నడుము చుట్టూ పేరుకుపోయి ఉంటుంది. దీనితో మల్లెతీగలాగా నాజూగ్గా ఉండాలిసిన నడుము  కాస్త బరువు పెరిగిపోయి చూడడడానికి ఎబ్బెట్టుగా మారిపోతుంది. అందరికి తెలిసిన విషయం ఏమిటంటే బెల్లీ ఫ్యాట్ ని తొందరగా తొలిగించుకోవడం  కష్టమైన పని అని.. ఓసారి పొట్టలో పేరుకుపోయిన కొవ్వుని తొలిగించుకోవడం అంత తొందరగా అయ్యే పనికాదు. కాని కింద చెప్పిన విధంగా ఒక్కరోజు ప్లాన్ చేసుకుంటే బెల్లీ ఫ్యాట్ ని తొందరగా తగ్గించుకోచ్చు.చాలామంది ఆడవాళ్ళకి  మనసులో బరువు తగ్గాలని ఉన్నా ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు.


అలాంటి వారు మెంతులను వాడి సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును మెంతులు చాలా త్వరగా కరిగించేస్తాయి.ఈ మెంతులు కూడా మన అందరి ఇళ్ళల్లో దొరికేవే.సాధారణంగా ఆడవాళ్ళు మెంతులను  వంటల్లో సువాసన, రుచి కోసం వాడతారు. కానీ మనం వాడే మెంతుల్లో కావల్సినంత పీచు పదార్థం ఉంటుంది.ఈ పీచుపదార్థం సులువుగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.కొన్ని టిప్స్ పాటించడం వలన బెల్లి ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. అవేంటో చూద్దాం.. !!  కొంచెం మజ్జిగలో ఓ స్పూన్ మెంతులను రాత్రంతా నానపెట్టాలి. ఉదయం పరకడుపునే నాన పెట్టిన మెంతులతో సహా మజ్జిగను కలిపి తాగేయాలి. ఇది కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో ఎలాంటి పొట్టనైనా ఈ మిశ్రమం కరిగించేస్తుంది.


అలాగే ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. వేడి నీటితో ఉదయంవేళ ఖాళీ కడుపుతో తినాలి. ఇవి మీలోని వ్యర్ధ పదార్ధాలను విసర్జించటమే కాదు బరువును గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. లేదా వేడి నీటితో కలిపి వాటిని నమిలివేయవచ్చు.
మెంతులను పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తర్వాత పౌడర్ గా చేసుకొని చల్లబడినతర్వాత తినవచ్చు. గాలి చొరని డబ్బాలో ఈ మెంతి పొడి వుంచాలి. పెరుగు తో కలిపి తినవచ్చు.మెంతి పొడిని గ్రీన్ లేదా బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు. ఖాళీ కడుపుతో ఉదయం వేళ తాగితే, అది ఆకలిని తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: