బాదం నూనె ఇలా వాడితే మీ ముఖం మెరవడం ఖాయం.. !!

Suma Kallamadi
మహిళలు చర్మ సంరక్షణ కోసం అనేక రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు.కొంతమంది అయితే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి బ్యూటీ పార్లర్ చుట్టి తిరిగి ఏవేవో రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు.ఫలితంగా అందం సంగతి ఏమోగానీ ఆ ముఖం రంగు రూపు మారిపోతాయి. ఆడవాళ్లు మేకప్ కూడా తరుచుగా వాడడం తగ్గించాలి. కెమికల్స్ కలిసిన క్రీమ్స్ ఎక్కువగా వాడడం వల్ల చర్మానికి హాని జరుగుతుంది.. అందుకనే సహజంగా చర్మాన్ని కాపాడుకోవాలి. అందుకనే బాదం నూనె ని వాడిచూడండి. బాదం నూనెలో ఉండే పోషకాలు చర్మం మెరిసేలా చేస్తాయి. బాదం నూనె ఎలాంటి చర్మానికైనా అనువైనది.

ఈ నూనెలో ఉండే పోషకాలు ముడతలు, బ్లాక్ హెడ్స్ అలాగే చర్మాన్ని  పొడిబారడం నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. ఇప్పుడు బాదం నూనె ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. !!బాదం నూనె,  నిమ్మరసం కలిపి రాసుకోవడం వల్ల మీ చర్మంలో ఉండే మొటిమలు, అలాగే జిడ్డు,  బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.ఒక గిన్నెలో బాదం నూనె, నిమ్మ రసాన్ని  సమానమైన మోతాదులో  తీసుకొని మిక్స్ చేసి ముఖం మీద రుద్దండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.అలాగే  తేనె,  బాదంపప్పులను సమానంగా తీసుకోండి.ఇది చర్మం గాజులాగా మెరిపిస్తుంది. అలాగే  మెడ  భాగంలో, ముఖం మీద కూడా వర్తించి బాగా మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.

మీ ముఖం నుండి ధూళిని తొలగిస్తుంది అలాగే మీ ముఖం రంగును కూడా పెంచుతుంది. 1 టేబుల్ స్పూన్ బాదం నూనె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పాలు కలిపి ముఖం మీద రాయండి. 15 నిమిషాల తరువాత ముఖం కడుక్కోవాలి. ముఖం మిరుమిట్లు గొలుపుతుంది.మీ ముఖం మీద ముడతలు ఉన్నట్లు అనిపిస్తే ఇది ఉత్తమ మార్గం. కొన్ని చుక్కల బాదం నూనె తీసుకొని రెండు టీస్పూన్ల విటమిన్ ఇ నూనెతో కలపండి. ముఖం మీద ముఖ్యంగా కళ్ళ క్రింద, పైకి మసాజ్ చేసి, అరగంట తరువాత కడగాలి.అంతే ముడతలు తగ్గి యవ్వనంగా ఉంటారు... !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: