ఆడవారిలో నెలసరితో వచ్చే నొప్పులను తగ్గించే సహజమైన చిట్కాలు మీకోసం...!

Suma Kallamadi
ఋతు స్రావం అనేది ఆడవాళ్ళలో ప్రతి నెల వచ్చే సహజ ప్రక్రియ. ఈ సమయంలో ఆడవాళ్లు చాలా  ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుంది. ఒక పక్క తీవ్ర రక్తస్రావం, మరో పక్క కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. వీటినే మనం ‘పీరియడ్ క్రామ్ప్స్’ అని కూడా అంటాము. ఈ నొప్పి అనేది అందరిలో ఒకేలాగా ఉండదు.. ఆడవాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మొదటి రోజు లేదంటే  రెండు, మూడు రోజులు ఉండొచ్చు..ఈ నొప్పిని భరించలేక చాలా మంది ఆడవాళ్లు నొప్పి నివారణ మందులు వేసుకుంటూ ఉంటారు. కానీ, ఇలా వేసుకోవడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇటువంటి సమయంలో మన ఇంట్లోనే లభించే ఆహార పదార్థాలను ఉపయోగించి కొన్ని హోమ్ రెమిడీస్ ని తయారు చేసుకోవచ్చు.


వాటిని ఉపయోగించటం ద్వారా నొప్పి నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు అవేంటో చూద్దాం.. మొలకల్లో పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీనులు ఎక్కువగా ఉంటాయి. మొలకల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. అలాగే పీరియడ్స్ సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇందులో నొప్పి నివారించడానికి సహాయపడే నొప్పి నివారణ (అనాల్జిసిక్ ) యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ టీ ఆకులను వేసి 3 - 5 నిమిషాల పాటు బాగా ఉడికించి వడగట్టాలి. టీ వెచ్చగా అయిన తరువాత రుచి కోసం కొంత తేనె జోడించి త్రాగండి. ఇలా రోజుకు 3 లేదా 4 సార్లు త్రాగటం వలన మంచి ఉపశమనం పొందుతారు.

చికెన్, వెజిటేబుల్ సూప్స్ పీరియడ్స్ లో నొప్పులతో పాటు ఏదైనా  అలసటను తగ్గిస్తాయి. అలాగే యుట్రస్ లో ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది.అలాగే జీడి పప్పు, వాల్ నట్స్, డేట్స్ మొదలగు వాటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని  నివారిస్తాయి. అలాగే తాజాపండ్లు అయిన  ఆపిల్, ఆరెంజ్, బొప్పాయి, అరటి పండు లలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ పండ్లు తినడం వల్ల యుటేరెస్ ఇన్ఫ్లమేషన్ అలాగే అలసట కూడా తగ్గుతుంది. ఆకుపచ్చగా, తాజాగా ఉండే కూరల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఎఫెక్టివ్ గా ఋతుస్రావ నొప్పులను తగ్గిస్తుంది. ఋతుక్రమ సమయంలో పాలు తాగడం చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్, కాల్షియం మరియు పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే పీచుపదార్థాలు, విటమిన్లు, ఐరన్ మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: