ఆడవాళ్ళ అందాన్ని మరింత పెంచే తేనెతో ఫేస్ ప్యాక్స్... !!

Suma Kallamadi
ప్రతి అమ్మాయి కోరుకునేది ఒక్కటే.. అందంగా కనిపించాలని.అలా కోరుకోవడంలో తప్పు లేదు. అయితే ఆ అందం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.చాలా డబ్బులు ఖర్చుపెట్టి ఏవేవో కెమికల్స్ కలిపిన క్రీమ్స్ ను ముఖానికి రాస్తూ ఉంటారు అయిన ఫలితం ఉంటుందా అంటే అది లేదు. అందుకనే మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో మన ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.మన ఇంట్లో దొరికే తేనెతో ఫేస్ పాక్స్ వేయడం వల్ల  ఏటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. తేనెలో యాంటీబాక్టీరియల్  అలాగే యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలు ఉండుట వలన అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇప్పుడు ఆ ప్యాక్స్ ఏంటో చూద్దాం.. !!


1స్పూన్ తేనెలో 1/2 స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మానికి అవసరమైన పోషణ కూడా అందుతుంది.
రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.కీరదోసకాయ రసంకి తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకొని 15నిముషాలు అలాగే వదిలేసి, ఎండిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. చర్మఛాయను తెల్లగా మార్చడంలో తేనె చాలా అద్భుతాలను చేస్తుంది. మీరు ఫెయిర్ గా మరియు యవ్వనంగా కనబడాలంటే కొద్దిగా నిమ్మరసంతో కలిపిన తేనె ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మచ్చలతో పాటు ముఖం కూడా క్రమేపి తెల్లగా మారుతుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: