ఇలా చేస్తే ఆడవాళ్లు చాలా సులువుగా బరువు తగ్గుతారు.. !!!

Suma Kallamadi
చాలామంది ఆడవాళ్ళని వేదించే అతి పెద్ద సమస్య బరువు పెరగడం.ఇలా బరువు పెరగడం వల్ల మంచి డ్రెస్ వేసుకోవాలన్న, చీర కట్టుకోవాలన్న గాని మహిళలు ఆలోచిస్తారు.లావు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు విషయం అంతా మనం తినే ఆహరంలోను,చేసే వ్యాయామంలోనే ఉంది.మనం తినే చాలా రకాల ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి అలాగే రుచిని అందించటమే కాకుండా బరువును కూడా తగ్గిస్తాయి. అధిక క్యాలోరీలు గల ఆహరం కాకపోయినా, మీకు సరిపోయేంత శక్తిని అందిస్తాయి.వీటిని సులభంగా మన భోజనంలో కలుపుకోవచ్చు. ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారము తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.అవేంటో తేకూసుకుందాం.. !!

పండ్లు మరియు కూరగాయల వలన సులభంగా బరువు తగ్గవచ్చు. ఇవి మనకు కావలసిన ఎక్కువ పోషకాలను మరియు తక్కువ కాలోరీస్’ని అందిస్తాయి.సహజ సిధమైన ఫాట్-ఫైటర్ అయినట్టి ద్రాక్ష పండ్ల సేకరణ వలన త్వరగా బరువు తగ్గవచ్చు. బ్లూ-బెర్రిస్, బ్లాక్-బెర్రిస్, క్రాన్-బెర్రీస్, రాస్పా-బెర్రీస్, స్ట్రాబెర్రిస్, ఆపిల్ మరియు దానిమ్మ వంటి పండ్లు కుడా తొందరగా బరువును తగ్గించుటలో సహాయపడతాయి.తృణధాన్యాలను అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా రోజుని ప్రారంభించవచ్చు. ఇవి ఎనర్జీ లెవెల్స్’ని ఎక్కువ చేస్తాయి.తక్కువ ఫాట్ కలిగి ఉండే పాల పదార్థాలు ఎక్కువ పోషకాలను అందించి, క్యాలోరీస్’లను ఇవ్వడంలో సహాయపడతాయి.

సాల్మన్ వంటి చేపలను తినటం వల్ల బరువు తగ్గటమే కాకుండా గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.నడుము చుట్టూ ఉండే అధికమైన కొవ్వులను తగ్గించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఆడవాళ్లు ఓట్-మీల్స్ తినడం అలవాటు చేసుకోవాలి.ఇవి బరువు తగ్గించటానికి మంచి ఆహరంగా చెప్పవచ్చు.మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేయటం వల్ల కూడా సులువుగా బరువును తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే బయట ఆహార పదార్థాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను తింటూ ఉండాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: