ద్రాక్ష పండుతో మీ చర్మాన్ని కాంతివంతం చేసుకోండి ఇలా.. !!

Suma Kallamadi

ద్రాక్ష అంద‌రికీ ఇష్ట‌మైన పండు. ఎందుకంటే, దాని చ‌క్క‌టి రుచితో పాటు తిన‌డానికి సులువుగా ఉండ‌డ‌మే కార‌ణంగా చెబుతారు చాలామంది. కానీ నల్ల ద్రాక్ష వల్ల ఆడవాళ్లకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటి వల్ల  ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా ఆడవాళ్ళ అందం కూడా రెట్టింపు అవుతుంది.అది ఎలానో తెలుసుకుందాం..నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావన్నది నిపుణుల మాట. ఈ ద్రాక్షలో ఉండే పాలిఫినాల్స్‌ శరీరంలోని కొల్లాజిన్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని వాడిపోకుండా రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

 


ద్రాక్ష పండ్ల‌లోని విట‌మిన్ 'సి' మ‌న చ‌ర్మంపై ఉన్న మచ్చ‌ల‌ను క్ర‌మంగా త‌గ్గించేందుకు తోడ్ప‌డుతుంది. ఇందుకోసం ఒక బౌల్‌ లో ద్రాక్ష పండ్లు, టేబుల్‌ స్పూన్ ప‌టిక బెల్లం, టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒవెన్‌లో ఉంచి కాసేపు బేక్ చేయాలి. ఆపై బ‌య‌ట‌కు తీసి చ‌ల్లారాక చ‌ర్మానికి అప్లై చేసుకొని అర‌గంట పాటు ఉంచుకొని క‌డిగేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే మచ్చ‌లు సులువుగా త‌గ్గిపోతాయి. ద్రాక్ష కేవ‌లం మ‌చ్చ‌లే కాదు. పిగ్మంటేష‌న్‌ని కూడా త‌గ్గిస్తుంది. ఇందులోని పాలీఫినాల్స్ చ‌ర్మాన్ని మొత్తం ఒకే రంగులో ఉండేలా చేస్తుంది. ఇందుకోసం ద్రాక్ష ర‌సాన్ని ముఖానికి ప‌ట్టించి అర‌గంట పాటు ఉంచుకొని ఆ త‌ర్వాత క‌డిగేసుకోవాలి. ఆ త‌ర్వాత మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది. మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే కెమిక‌ల్స్ నిండిన క్రీములు రాయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. గ్రేప్‌ సీడ్ ఆయిల్‌లో విట‌మిన్ E ఎక్కువ‌గా ఉంటుంది.. ఇది ఆడవాళ్ళ  చ‌ర్మాన్ని ఎంతో మృదువుగా మారుస్తుంది. దీని కోసం ద్రాక్ష మిశ్ర‌మంతో ముఖాన్ని నెమ్మ‌దిగా స్క్ర‌బ్ చేసుకొని అర‌గంట ఉంచుకొని క‌డిగేసుకుంటే స‌రి.. 

 


 ద్రాక్ష పండ్లు మీ చ‌ర్మ ఛాయ‌ను కూడా పెంచుతాయి. ద్రాక్ష పండ్ల గుజ్జుతో పాటు ముల్తానీ మ‌ట్టి, రోజ్‌ వాట‌ర్ క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట పాటు అలాగే ఉంచుకొని గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేసుకోవాలి. మ‌న చ‌ర్మంలోని మ‌లినాల‌ను తొల‌గించ‌డంతో పాటు మాయిశ్చ‌రైజ్ కూడా చేస్తుంది ద్రాక్ష. ఇందులోని న్యూట్రియంట్లు చ‌ర్మంలో ఎక్కువ‌గా ఉన్న జిడ్డును తొల‌గించి అది తాజాగా క‌నిపించేలా చేస్తాయి. దీనికి టేబుల్ స్పూన్ చొప్పున ద్రాక్ష ర‌సం, నిమ్మ‌ర‌సం, పుదీనా ర‌సం క‌లిపి ముఖానికి అప్లై చేసుకొని పావుగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజ్‌వాట‌ర్‌తో ముఖం తుడుచుకొని.. చ‌న్నీళ్ల‌తో కడుక్కోవాలి. చూసారు కదండీ నల్ల ద్రాక్ష తినడం వలన కలిగే లాభాలు కావున నల్ల ద్రాక్షను తిందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: