మీకోక చెల్లి ఉంటే ఈ వార్త చెప్పండి .. సంతోషపడుతుంది !

KSK

ప్రస్తుత రోజుల్లో సమాజంలో అన్ని వ్యవస్థలు, బంధాలు మరియు బాంధవ్యాలు ప్రమాదకరంలో పడ్డాయి. భార్య భర్తల బంధం అయినా తల్లిదండ్రులకి పిల్లల మధ్య ఉన్న సంబంధమైన గతంలో మాదిరిగా ప్రస్తుత రోజులలో  కనబడటం లేదు. ముఖ్యంగా టెక్నాలజీ రావటంతో చాలావరకు భార్యభర్తల వ్యవస్థ దెబ్బతింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కారణం టెక్నాలజీ వల్ల ఎక్కువ అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు కూలిపోయి పిల్లల జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. అంతేకాకుండా అక్రమ సంబంధం బయట పడటం వల్ల పరువు తో పాటు ఎవరో ఒకరి ప్రాణం కూడా పోతున్న పరిస్థితులు సమాజంలో ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఆస్తిపాస్తులు కోసం తల్లిదండ్రులను చంపేసే రీతిలో కన్న కొడుకులు మరియు కూతుర్లు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అమెరికాలో ఆరేళ్ల వయసు కలిగిన చిన్న బాలుడు తన చెల్లి కోసం చేసిన సంఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


సొంత చెల్లెలు కోసం ప్రాణాలకు తెగించి ఆరు సంవత్సరాల వయసు కలిగిన ఈ బుడతడు కుక్క తో పోరాడి ముఖానికి 90 కుట్లు వేయించుకోవటం జరిగింది. బ్రిడ్జర్ వాకర్ అనే 6 సంవత్సరాల అబ్బాయి తన చెల్లి వెనకాల కుక్క వెంట పడటంతో చూసి తన గురించి కూడా ఆలోచించకుండా చుట్టుపక్కల మనుషులు ఎవరూ రాకపోయినా కానీ పరిగెత్తి మరీ తన చెల్లెను కాపాడుకున్నాడు. ఆ కుక్కతో ప్రాణాలకు తెగించి మరీ పోరాడి ఈ అన్న తన చెల్లెల ప్రాణాలను కాపాడుకోవటం జరిగింది. 

ఈ విషయాన్ని బ్రిడ్జర్ వాకర్ బంధువులు సోషల్ మీడియాలో వెల్లడించారు. నా మేనల్లుడు సూపర్ హీరో, ప్రపంచంలో బంధాలు బాంధవ్యాలు కోల్పోతున్న ఇటువంటి రోజులో కేవలం ఆరు సంవత్సరాల వయస్సులో నా మేనల్లుడు తన చెల్లెలి కోసం 90 కుట్లు వేయించుకునేలా కుక్క తో పోరాడి… రియల్ హీరో అనిపించాడు అని కొనియాడారు. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు బ్రిడ్జర్ వాకర్ ఈజ్ రియల్ హీరో అని అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: