అమ్మ : అమ్మ అని పిలిపించుకోవాలని ఎదురుచూసే మహిళలకు ముఖ్యమైన సూచనలు.. !!

Suma Kallamadi

పెళ్లి అయిన ప్రతి మహిళ అమ్మ కావాలని, బిడ్డ అమ్మ అని పిలిపించుకోవాలని ఎదురుచూస్తుంది.అయితే త్వరగా గర్భం దాల్చాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించాలి.. !సరిగ్గా అండం విడుదల అయ్యే ముందు రతి జరపాలి. అండం అనేది  విడుదలై ఫెలోపియన్ ట్యూబ్ (fallopian tube) లో స్పెర్మ్ కోసం వేచి ఉండేది కేవలం 24 గంటలు మాత్రమే. కానీ స్పెర్మ్ 50 గంటలు నిలువగలదు.అండం విడుదలవగానే, ఫెలోపిన్ ట్యూబ్ లో వీర్య కణాలు వేచి ఉంటే, తప్పక విజయ కలుగుతుంది.అంటే అండం యొక్క కాలవ్యవధి 24 గంటలు మాత్రమే.. ఆ 24 గంటల సమయంలోనే వీర్యకణాలు అండంతో కలిస్తే పిండం ఏర్పడుతుంది. శుక్రకణాల కాలవ్యవధి మాత్రం సుమారు 72 గంటల వరకు ఉంటుంది.

 

 

ఆడవాళ్ళ సగటు పీరియడ్ 28 రోజులనుకుంటే 14 వ రోజున అండం విడుదల జరుగుతుంది. పీరియడ్ అయిన వారం తరువాత తరచూ రతిలో పాల్గొనటం మంచిది.పీరియడ్ అయిన 10వ రోజునించీ ప్రతి రోజు రతిలో పాల్గొంటే తప్పకుండా గర్భ ధారణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అలాగే ఆరోగ్యవంతమైన గర్భం కోసం పౌష్ఠిక ఆహారం  తినడం భార్యాభర్తలిద్దరికీ కూడా చాలా అవసరం.మనం తినే ఆహారం ఒక వైపు ఆరోగ్యం చేకూరుస్తూ మరోవైపు గర్భ ధారణకి సహకరించేటట్టు ఉండాలి.

 

 

మీరోజు వారీ భోజనంలో ఈ క్రింది ఆహార పదార్ధాలు చేర్చండి. పాల కూరలో అండోత్పత్తికి,స్పెర్మ్ వృద్ధికి కావలసిన జింక్ ధాతువు బాగా ఉంది.అరటి పండులో విటమిన్ B6 హార్మోన్ల విడుదలకి ఉపయోగపడుతుంది. గుడ్లు, బలవర్ధక మైన పప్పు ధాన్యాలు శరీరానికి కావలసిన విటమిన్, ప్రోటీన్లు ని అందిస్తాయి. బీన్స్, పప్పు ధాన్యాలు గర్భం ధరించేందుకు సానుకూలమైన పోషకాలని అందిస్తాయి.పౌష్ఠిక ఆహారం తీసుకుంటూ, పైన చెప్పిన సూచనలు పాటిస్తే మీకు గర్భధారణ త్వరగా అయ్యే అవకాశాలు  చాలా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: