అమ్మ : గర్భిణీ స్త్రీకి ఉమ్మనీరు సరిపడా లేకపోతే ఏమవుతుందో తెలుసా.. !!

Suma Kallamadi

కడుపులోని బిడ్డ ప్రపంచంలోకి వచ్చాక అమ్మ రక్షణగా ఉంటుంది. అదే కడుపులో ఉన్నప్పుడు బిడ్డకి  ఉమ్మనీరే రక్షణగా ఉంటుంది. నీరే కదా అనుకోకండి.. ఆ నీరే  బిడ్డకు  పోషకాల మయం. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడే రక్షణ జలం. అయితే ఆ ఉమ్మనీరు తక్కువయినా గాని  ఎక్కువయినా గాని  బిడ్డ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే ఉమ్మనీరు  నిల్వ సరిపడా ఉండేలా చూసుకోవడం తల్లికి ముఖ్యం..!పుట్టబోయే పాపాయి తల్లి గర్భసంచిలో ఉన్న తొమ్మిదినెలలూ సౌకర్యాన్నీ, రక్షణనూ అందించడంలో ఉమ్మనీరు కీలక పాత్ర పోషిస్తుంది. బిడ్డ ఎదుగుదలకూ తోడ్పడుతుంది. చెప్పాలంటే పాపాయి ఇందులోనే తేలియాడుతుంది.అసలు ఉమ్మనీటి వల్ల పాపాయికి ఎలా మేలు జరుగుతుందో చూద్దాం.

 

 

 

ఈ ఉమ్మనీరు బిడ్డ ఉపిరితిత్తులు పరిణతి చెందేలా చేస్తుంది. బిడ్డ కండరాలూ, ఎముకలూ వృద్ధి చెందుతాయి. బొడ్డుతాడు కుంచించుకుపోకుండా ఉంటుంది. అప్పుడే రక్తప్రసరణ సజావుగా సాగి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. గర్భసంచిలోని ఉష్ణోగ్రత కూడా ఉమ్మనీటివల్లే  సమతుల్యంగా ఉంటుంది. అలా పాపాయి శరీరభాగాలన్నీ తేమగా ఉంటాయి. అదెలా సాధ్యం అంటే.. ఉమ్మనీటిలోనే  పోషకాలూ, హార్మోన్లూ, యాంటీబాడీలు ఉంటాయి. అవన్నీ కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి పాపాయిని కాపాడతాయి. ఇలా అన్ని రకాలుగా కీలక పాత్ర పోషించే ఉమ్మనీరు గర్భం దాల్చినప్పటినుంచీ నెలలు నిండేవరకూ కొంతశాతం పెరుగుతూ ఉంటుంది. గర్భం దాల్చిన రెండున్నర నెలల్లో 30 ఎంఎల్‌ ఉండి తొమ్మిదో నెల నిండేసరికి లీటరు వరకూ చేరుకుంటుంది. కొందరిలో ఇది తగ్గొచ్చు లేదా పెరగొచ్చు.గర్భంతో ఉన్న మహిళ తరుచు డాక్టర్ని సంప్రదించి ఉమ్మనీటి శాతం చెక్ చేయించుకుంటూ ఉండాలి. వీలయినన్ని ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి 

 

 


 అలాగే ఒక్కోసారి ఉమ్మనీరు ప్రసవానికి ముందే పడిపోతుంది. కానీ అలాంటప్పుడు గర్భిణీ చాలా జాగ్రతగా ఉండాలి. ఉమ్మనీరు పసుపు రంగులో ఉండి, జిగట స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది గుర్తించి వెంటనే వైదుడ్ని సంప్రదించాలి. లేదంటే కడుపులోని బిడ్డకు ప్రమాదం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: