పీరియడ్స్ సరిగ్గా రావడం లేదా.. అయితే ఇలా చేయండి..!!

Kavya Nekkanti

సాధార‌ణంగా ప్రతి అమ్మాయినీ నెలకోసారి పీరియ‌డ్స్‌ వచ్చి పలకరించి వెళుతుంది. అయితే పీరియ‌డ్స్ విషయంలో వారికి ఎన్నో సందేహాలుంటాయి. కానీ వాటి గురించి ఎవరితోనూ చర్చించడానికి అస్స‌లు ఇష్టపడరు. ఆ సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి సైతం తమలోనే దాచుకొంటారు. వాస్త‌వానికి నెలసరిలో ప్రతి మహిళ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కునే తీరుతుంది. నొప్పి అలాగే కడుపుబ్బరం వంటివి నెలసరి వలన కలిగే అసౌకర్యాలు. అందువలన, నెలసరి అంటేనే కాస్తంత చికాకుగా అనిపిస్తుంది. పీరియడ్స్ వలన కలిగే అసౌకర్యం వలన నిద్ర సరిగ్గా పట్టదు. దీంతో మ‌రింత ఒత్తిడి పెరుగుతుంది.

 

ఇక‌ పీరియ‌డ్స్ ప్ర‌తి నెల రాక‌పోతే మ‌ళ్లీ టెన్ష‌న్ ప‌డిపోతారు. అదే ఇరెగ్యులర్ పీరియడ్స్. ఈ స‌మ‌స్య‌ను చాలా మంది ఎదుర్కొంటున్నారు. జీవన విధానంలో మార్పులు, మానసిక వత్తిడి, తప్పుడైట్ పాటించటంవలన, ఆడవాళ్ళు ఈ పిరియడ్స్ సమస్యల వలయంలో చిక్కుకుపోతారు. అయితే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలంటే.. ఆస్పత్రులు, మెడిసిన్స్‌పైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలతో కూడా సమస్యని తగ్గించుకోవచ్చు. సాధార‌ణంగా హార్మోన్స్ మార్పుల వల్ల శరీరంపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. 

 

ఈ కారణంగానే పీరియడ్స్ తప్పడం, ఆగిపోవడం జరుగుతుంటుంది. అయితే అన్ని రకాలైన పోషకాలు, మినరల్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అందుకోసం రకరకాల పండ్లు, కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకోండి. అలాగే అల్లం అనేది గొప్ప ఔషధం. వంటల్లో అధికంగా వాడే అల్లం ఆరోగ్యం ప‌రంగానూ ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని చాలా రకాలైన ఔషధాల తయారీల్లోనూ వాడతారు. అయితే అల్లంతోనూ ఇరెగ్యులర్ పీరియడ్స్‌ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అందుకు  ఓ కప్పు నీటిలో తాజా అల్లం ముక్కని వేసి బాగా మరిగించి.. కాసేప‌టి త‌ర్వాత‌ వడకట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొద్దిగా తేనెని క‌లిపి.. ప్రతి రోజూ భోజ‌నం చేసిన తర్వాత తాగండి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: