అమ్మ: పుట్టేది మగబిడ్డ అయితే గర్బవతిలో ఈ మార్పలు ఖాయం ...!

Suma Kallamadi

 

గర్భం ధరించడం సృష్టిలోనే అద్భుతమైన ఘట్టం. మీరు గర్భిణీ అని తెలియగానే, కుటుంబసభ్యుల ఆనందానికి అవధులుండవు. పుట్టబోయేది ఆడా, మగ అనే ఆసక్తి  మొదటిరోజు నుంచే మొదలైపోతుంది.కాని పుట్టబోయే బిడ్డ ఎవరయినా గాని ఒక్కటే.కాని కొంతమంది మాత్రం వారసుడు కోసం ఎదురుచూస్తారు. అయితే మన పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళు కొన్ని ఆనవాళ్ళని బట్టి పుట్టేది మగబిడ్డో లేక ఆడబిడ్డో అన్నది పసి గట్టేవాళ్ళు. ఇప్పుడు కొన్ని మగ బిడ్డ లక్షణాలు ఏంటో చూద్దాం...

 

 


కడుపులో పెరిగే బిడ్డ మగ బిడ్డ అయితే ఆ గర్భిణీ స్త్రీ ముఖంలో కాంతి తక్కువగా ఉంటుంది. ముఖం వాడిపోయినట్లు ఉంటుంది. సాధారణంగా ఎడమ వైపు రొమ్ము యొక్క పరిమాణం ఎప్పుడూ కుడి వైపు కంటే పెద్దదిగా ఉంటుంది. కానీ మీ గర్భధారణ సమయంలో ఎడమ వైపు కంటే కుడి వైపు రొమ్ము పెద్దదిగా ఉన్నట్లయితే ఒక మగ పిల్లవాడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి.. మీ కడుపు చుట్టూ మాత్రమే బరువు పెరుగుతున్నట్లయితే, మీరు ఒక బోసినవ్వుల మగ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దపడుతున్నారని తెలియజేస్తుంది. మగబిడ్డ కడుపులో ఉంటే మానసికస్థితిలో ఎలాంటి మార్పులు ఉండవని కొంతమంది అభిప్రాయం. 

 

 


ఇవన్నీ చాలా మంది స్త్రీలు ఎక్కువగా నమ్ముతున్న విశ్వాశాలు. అయితే పైన పేర్కొన్న మార్పులు గర్భాధారణ సమయంలో చాలా సాధారంగా ప్రతీ మహిళకూ కనిపించే లక్షణాలు. అది వారి శరీరతత్వం, హార్మోనుల మార్పుల కారణంగా సంభవిస్తూ ఉంటాయి. ఇది ఒక్కో స్త్రీ విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. కాబట్టి ఈ అంచనాలు అన్ని వేళలా పని చేయకపోవచ్చు. కాబట్టి అందమైన తల్లులంతా ఊహిస్తూనే ఉండండి. మీ ఊహలు నిజమయ్యేవరకు వేచియుండండి. వేచి ఉండటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి.. ఆడపిల్లా అయినా మగ పిల్లవాడు అయినా గాని చింతించాలిసిన పని లేదు. తల్లికి ఏ బిడ్డ అయినా ఒక్కటే.. మగ పిల్లవాడు అయినా, ఆడపిల్ల అయినా పిలిచే పిలుపు ఒక్కటే "అమ్మ" అనే...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: