అమ్మ: పుట్టే బిడ్డ మగ బిడ్డ అయితే, ఆ గర్భిణీ స్త్రీ లక్షణాలు ఎలా ఉంటయో తెలుసా ..?

Suma Kallamadi

 

తల్లి కాబోతున్న ప్రతి మహిళకు ఉండే ఒకే ఒక ఆలోచన కడుపులో బిడ్డ గురించి.పుట్టేది ఆడబిడ్డ లేక మగబిడ్డ అనే ఆందోళనలో కొంతమంది దంపతులు అయోమయంలో ఉంటారు. అయితే మీ  ఇంట్లో తప్పటడుగులు వేయబోయే మీ ముద్దుల శిశువు రాకకు సంభందించిన కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఏంటో చూద్దాం. 

 

 

 

తల్లి కాబోయే ప్రతీ ఒక్క స్త్రీ రాబోయే తమ వారసుల కొరకు ఎంతో ఉత్తేజకరమైన సందర్భాలను తలచుకుంటూ మనసులో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతారు. దానికి  కారణం మరేదో కాదు. రాబోయే తన ముద్దుల బిడ్డ యువరాజు అయి ఉంటాడా లేదా యువరాణి అయి ఉంటుందా అని తెలుసుకోవాలని చిన్న కుతూహలం చాలా సాధారణ విషయం. అయితే దీనిని దగ్గరగా అంచనా వేయడానికి ఇక్కడ మేము మగ శిశువుకి కాబోయే తల్లికి గల కొన్ని లక్షణాలను పొందిపరిచాము. ఇవన్నీ కొందరి విషయంలో మాత్రమే పని చేసే కొన్ని నమ్మకాలు మాత్రమే, ఇవి అందరికీ పనిచేయకపోవచ్చు. కాబట్టి కేవలం వీటిని మాత్రమే పరిగణలోనికి తీసుకోవద్దని అభ్యర్ధన. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని సంతోషంగా మీ కుటుంబం లోనికి మరింత ఆరోగ్యవంతులయిన యువరాణి లేదా యువరాజును హృదయపూర్వకంగా ఆహ్వానించండి.

 

 

 

మన పెద్దవాళ్ళు అధికంగా విశ్వసించే కొన్ని నమ్మకాలను  ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి తన శిశువుని గర్భంలో మోసే స్థితి కూడా శిశువు యొక్క లింగం కొరకు నిర్ధారణ చేస్తుంది. కాబట్టి తల్లి ఒకవేళ గర్భస్థ శిశువుని దిగువ ఉదర స్థానముగా కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ  శిశువు మగ శిశువు అయ్యే అవకాశాలు ఉన్నాయి.అలాగే గర్భిణీ స్త్రీ ఉదయ కాలములో  ఎటువంటి తరుచు అనారోగ్యాలు లేకుండా ఉన్నట్లయితే పండంటి మగ బిడ్డకి జన్మనిస్తుందని చెబుతూ ఉంటారు. ఇది ఎక్కువగా గర్భధారణ సమయంలో హార్మోనుల మార్పులవల్ల సంభవిస్తుంది. ఇది మహిళకి మహిళకి మధ్య వేరు వేరుగా  ఉంటుంది.మీ వయస్సుని మీరు గర్భం దాల్చిన నెల సంఖ్యకు జత చేస్తే ఫలితంగా వచ్చే సంఖ్య సరి సంఖ్య అయినట్లయితే  పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ అని చాలా మంది నమ్ముతారు. రేపటి అమ్మ ఆర్టికల్ లో ఇంకా కొన్ని మగబిడ్డ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: