అమ్మ : తల్లి ప్రేమ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఇది చదవండి... !!

Suma Kallamadi

 

 

కనిపించే దేవత అమ్మ, తను ఎల్లప్పుడూ బిడ్డ క్షమమే కోరుకుంటుంది. తాను ఎన్ని కష్టాలు పడ్డగాని ఎల్లప్పుడూ బిడ్డ సంతోషాన్ని కోరుకుంటుందనటానికి ఒక చిన్న ఉదాహరణ మీకోసం.... !!!

 

 

ఒక తల్లి తన కొడుకుకి పుట్టగానే ఆ కొడుకు కి మాట ఇస్తుంది నువ్వు పుట్టినప్పటినుండి నేను నిన్ను కంటికి రెప్పలా కపడుకుంటాను అని చెప్తుంది.ఆ కొడుకు పెరిగి పెద్దవాడు ఆయ్యాడు మంచి చదువు చదువుకున్నాడు.
ఒక రోజు కొడుకు  అమ్మ అన్నం తిందువు రామ్మ అంటాడు.ఆ తల్లి నాకు ఆకలిగా లేదు అని చెపుతుంది.మరుసటి రోజు ఆ కొడుకు, తల్లి అన్నం తింటూ ఉంటారు.కొడుకు అంటాడు అమ్మ నువ్వు వండిన కూర ఎంతో బాగుంది తిందమురా అని పిలిస్తే నాకు ఈ కూర నచ్చదు ఇవాళకి  నేను పచ్చడితో తింటాను అని అంటుంది అమ్మ.కొద్ది రోజుల తర్వాత ఆ వీధిలో  అందరూ తీర్థ యాత్రలకు వెళ్తే అమ్మ నువ్వు కూడా వేళ్ళిరా అంటే నాకు తీర్థ యాత్రలకు వెళ్ళటం ఇష్టం ఉండదు నేను వెళ్ళాను అని అంటుంది.కొద్దిరోజులకు ఆ కొడుకు పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లి పోతాడు.

 

అక్కడ నుండి కాల్ చేసి అమ్మ నువ్వు ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు ఆ తల్లి నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది.మా దగ్గరికి వచ్చి ఉండిపో అమ్మ అని అంటారు.నాకు అక్కడికి రావటం ఇష్టం లేదు అని అంటుంది.అక్కడ ఎప్పుడు ఎదో శబ్దం వినిపిస్తుంది అక్కడికి...నేను రాను అని అంటుంది సరే అమ్మ డబ్బు ఎమన్నా పంపించమంటావా అని అడిగితే వద్దు నాకు సరిపడా డబ్బు ఉంది అని చెప్తుంది.
కొద్దిరోజులు తర్వాత ఆ తల్లి ఒంట్లో బాగోలేదని వార్త వస్తుంది.ఆ కొడుకు తల్లి దగ్గరకు వెళ్తాడు కానీ ఆ కొడుకు వెళ్లే లోపే తల్లి మరణిస్తుంది అప్పుడు ఆ కొడుకు తల్లి కాళ్ళ పై పడి నన్ను క్షమించు అమ్మ అని ఏడుస్తూ  చిన్నపుడు అన్నం తిందమురా  అమ్మ..అంటే ఆకలిగాలేదు అన్నావ్ అమ్మకి ఆకలిగా లేదేమో అనుకున్న కానీ అన్నం  లేదని నేను గ్రహించలేదు. నువ్వు వండిన కూర బాగుంది తిందామురా  అమ్మ అంటే నాకు ఈ కూర నచ్చదు నేను పచ్చడితో తింటాను అన్నావు కానీ సరిపడా కూర లేదని తెలుసుకోలేక పోయాను.

 

 

తీర్థయాత్రలు వెళ్ళిరమ్మంటే నా  కోసం సంపాదించిన డబ్బు కర్చుచేయడం ఇష్టం లేక వెళ్ళాను అన్నావు.నీకు కాల్ చేసినప్పుడు బాగున్నవా అని ఆడిగానే తప్ప ఒక్కసారి కూడా నీ దగ్గరకి రాలేదు.మా దగ్గరకు రమ్మటే మేము ఇబ్బందిపడతమేమో అని రాను అన్నావు.  డబ్బు పంపన అంటే నాకు డబ్బు ఉందొ లేదో అని వద్దు అన్నావు. నా  కోసం ఇప్పటి వరకు నువ్వు చేసినవన్ని అబద్ధాలే కానీ ఆ అబద్దాలు కూడా నా  మంచి కోసమేనా?

 


మరో జన్మ అంటూ ఉంటే నీకె కొడుకుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటా అమ్మ.. నువ్వు ఉన్నపుడు నీ త్యాగం, ప్రేమ అర్ధంకాలేదు.. అర్ధమయ్యేసరికి నువ్వే దూరం అయ్యావు అమ్మ అని విలపించాడు.. అమ్మ ఉన్నపుడే అమ్మ విలువ తెలుస్తుంది.. అమ్మ లేనపుడు విలువ తెలుసుకున్న గాని ఏమి లాభం... అప్పుడు అమ్మే ఉండదు... !!

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: