వామ్మో ఆడవాళ్లు మెట్టెలు పెట్టుకోవడం వెనుక ఇంతా రహస్యం ఉందా.. !!

Suma Kallamadi

వివాహం అయిన ఆడవారు మెట్టెలు  పెట్టుకుంటారు. హిందూ మరియు ముస్లిం సంప్రదాయాలలో, మహిళల వివాహం గుర్తుగా మెట్టెలు పెట్టుకుంటారు. ఇది ముఖ్యంగా కాలి రెండవ వేలుపై ధరిస్తారు సాధారణంగా మెట్టెలు వెండి ధాతువుతో తయారు చేస్తారు. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారు మెట్టెలు ఉపయోగిస్తారు ఇది సంప్రదాయానికి విరుద్ధమైనది.వివాహిత స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో ''మెట్టెలు''గా ఉన్న ఈ పదం నిజానికి ''మట్టెలు''. మనలో చాలామందికి అసలు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి అనే సందేహం మీలో ఉందా.. అయితే ఈ కథనం చదవండి.

 

కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగథ.

 

దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది.

 

మెట్లు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలు

 మెట్టెలు ధరించడం శుభసూచకం, మంగళకరం.

మెట్టెలు వెండితో తయారైనవి. వెండి శరీరంమీద ఉంటే మంచిది.

 గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్ళకు సంబంధం ఉంటుంది. వేళ్ళకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెలవల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు.

 

పురుషుల కంటే స్త్రీలలో కామం ఎక్కువట. ఈ విషయాన్ని ఆధునిక సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. పూర్వకాలంలోనే ఈ వాస్తవాన్ని కనిపెట్టిన మన మహర్షులు స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే కొంత కామం తగ్గుతుందని, పురుషునితో సమానంగా ఉంటుందని, అప్పుడు భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రావని ఈ మెట్టెల ఆచారాన్ని ప్రవేశపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: