వినూత్న రీతిలో హ్యాపీ మదర్స్ డే చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్
దక్షిణాది చిత్ర సీమ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన తల్లి శిరోమణి, సోదరి పద్మినికి వినూత్నంగా మదర్స్ డే శుభకాంక్షలు తెలిపారు.తన తల్లితో కలసి దిగిన ఫొటోను, అలాగే సోదరి తన కొడుకుతో ఉన్న ఫొటోను పక్కపక్కనే ఉంచుతూ ట్విట్టర్లో షేర్ చేశాడు. పిల్లలను ప్రేమానురాగాలతో పెంచుతున్న ప్రతీ తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అంటూ కామెంట్లు పెట్టాడు. ఇదిలా ఉండగా దేవి శ్రీ ప్రసాద్ ట్విట్టర్ పోస్టులకు ఆయన అభిమానులు మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. డీ ఎస్ పీ మీ ప్రేమ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది..అని కొందరంటే...మీ తల్లిదండ్రులు ఎంతో గొప్పవారు...అంటూ హ్యాపీ మదర్స్ డే శిరోమణిగారు అంటూ పేర్కొన్నారు.
దేవి శ్రీ ప్రసాద్‌కు తన ఫ్యామిలీ అంటే ప్రాణం. ఎంతో ప్రేమాభిమానాలతో మెదులుతుంటారు. నాన్నకు ప్రేమతో సినిమాకు పనిచేస్తున్న సమయంలో దేవీ శ్రీ ప్రసాద్ నాన్న మరణించిన విషయం తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ఆ తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.[1] దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. చిన్నతనంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుని అప్రతిహత విజయాలతో ముందుకు సాగిపోతున్నాడు.
HAPPIEST MUSICAL MOTHER’s DAY to my DEAREST MOTHER
Mrs.Siromani SatyaMurty..🤗
My Dearest Sister, Padmini..🤗
& to every Lovely Mother in this WORLD..🙏🏻
The Reason for our HAPPINESS❤️#HappyMothersDay2020 pic.twitter.com/v6EtGxeq2R — DEVI SRI PRASAD (@ThisIsDSP) May 9, 2020
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple