అమ్మ‌: త‌ల్లి కాబోతున్నారా అయితే వారానికి ఒక్క‌సారైనా ఇది తినండి

Arshu
ప్ర‌తి ఆడ‌దానికి అమ్మ‌ అనిపించుకోవాల‌నుంటుంది.  ఆడ‌వాళ్లు గ‌ర్భ‌వ‌తులుగా ఉన్నప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. క‌డుపుతో ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా ఆహార‌నియ‌మాలు చాలా జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. పిల్ల‌లు క‌డుపులో ఉన్న‌ప్పుడు శారీర‌క అవ‌య‌వాలు ఏర్ప‌డేవ‌ర‌కు మెద‌డు సామ‌ర్ధ్యం పెర‌గ‌డానికి దోహ‌ద ప‌డుతుంది. అందుకే గర్భంతో ఉండగా కాబోయే అమ్మలు ఏమేమి తినాలి, ఏయే పదార్థాలకు దూరంగా ఉండాలో ఓ పెద్ద లిస్టు చెబుతుంటారు అటు వైద్యులు, ఇటు పెద్దలు. దీనిపై ఏళ్ల తరబడి పరిశోధనలు సైతం సాగుతూనే ఉన్నాయి. గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది.

 గర్భవతులు వారానికి ఒకసారయినా చేపలను తింటే వారికి పుట్టే పిల్లలు అత్యంత తెలివితేటలతో ఉంటారని ఆ అధ్యయనం తేల్చింది. {{RelevantDataTitle}}