డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేసిన కిరాతకుడికి నిప్పు పెట్టి చంపిన యువతి

Suma Kallamadi

ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఇతరులతోనూ ఏకాంతంగా గడిపేందుకు ఒత్తిడి తెస్తున్న వ్యక్తిని ఓ యువతి హత్య చేసింది. అమెరికాలో విస్కాన్సిన్‌లోని కెనోషాలో నివసిస్తున్న క్రెస్టుల్ కిజెర్ (19) అనే యువతి ర్యాండీ వోలార్ అనే వ్యక్తిని తుపాకీతో షూట్ చేసి, నిప్పు పెట్టి చంపినందుకు ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది.


హత్యకు గురైన ర్యాండీ వోలర్.. అమ్మాయిలను అక్రమంగా తరలిస్తుంటాడని, క్రెస్టుల్ కిజెర్‌తో కూడా పరిచయం పెంచుకుని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. మనుషుల అక్రమ తరలింపు బాధితులకు హత్యా నేరాల్లో వెసులుబాటు కల్పించేలా అవకాశాలను పరిశీలించాలని కోర్టును కోరారు. అయితే, ఈ కేసును వాటితో పోల్చలేమని కోర్టు వెల్లడించింది.


‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం 2016లో కిజర్‌ 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఓ వెబ్‌సైట్ ద్వారా ర్యాండీ వోలర్‌కు పరిచయమైంది. ఆ తర్వాత అతడు ఆమెకు మాయమాటలు చెప్పి వ్యభిచారం చేయించేవాడు. రెండేళ్ల తర్వాత ఆమె ఆ వృత్తికి దూరమైంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జీవించడం మొదలుపెట్టింది. అయితే, వోబర్ మాత్రం ఆమెను పదే పదే వేధించేవాడు. ఆమెను ఇతరుల వద్దకు పంపేందుకు ప్రయత్నించేవాడు. దీంతో విసుగెత్తిపోయిన కిజర్.. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది.


ఆమె ప్రియుడు ఆమెకు పిస్తోల్ ఇచ్చాడు. ఇకపై ఒత్తిడి తెచ్చినట్లయితే ఆత్మ రక్షణ కోసం పిస్తోల్‌ను ఉపయోగించాలని చెప్పాడు. ఓ రోజు వోబర్ ఆమెను ఇంటికి పిలిచాడు. దీంతో కిజర్ అక్కడికి వెళ్లింది. ఆమెను మాటల్లో పెట్టి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చాడు. కిజర్ తనకు మత్తుగా ఉందని చెప్పింది. దాన్ని అవకాశంగా తీసుకుని వోబర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తన ప్రియుడు ఇచ్చిన పిస్తోల్‌ను తీసుకుని అతడి తలలోకి రెండు బుల్లెట్టు దింపింది. అనంతరం అతడికి నిప్పు పెట్టి.. బీఎండబ్ల్యూ కారులో పరారైంది. అయితే, డ్రగ్స్ మత్తులో ఉండటం వల్ల తనకు హత్య చేసినట్లే గుర్తులేదని కిజర్ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆమె ఇంకా జైల్లోనే ఉంది. త్వరలోనే ఈ ఘటనపై కోర్టు తీర్పు వెల్లడించనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: