బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్ `కాప్సికమ్ రోల్స్`
కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి- ఒక కప్పు
కాప్సికమ్- రెండు
పసుపు- అర టీ స్పూన్
టమోటాలు- రెండు
ఉల్లిపాయ- రెండు
పచ్చిమిర్చి- మూడు
టమోటా కెచప్- ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి- ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి- అర టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడ
నీరు- తగినంత
నూనె- తగినంత
తయారీ విధానం:
ముందుగా గోధుమపిండిలో ఉప్పు వేసి మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి కాగిన తరువాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. అనంతరం కాప్సికమ్, టమోట ముక్కలు కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కావాలనుకుంటే కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ఉప్పు, టమోటా కెచప్ వేసుకొని ఐదు నిమిషాలు అయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో చపాతీలు వొత్తుకోవాలి. చపాతిని కాల్చిన తర్వాత ఒక వైపు సిద్ధం చేసి పెట్టుకున్న కాప్సికమ్ కర్రీని పెట్టి రోల్స్‌గా చుట్టుకోవాలి. అంతే కాప్సికమ్ రోల్స్ రెడీ. వీటిపి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే చాలా బాగుటుంది. సో.. తప్పకుండా ట్రై చేయండి.