థమన్ క్లారిటీ.. త్రివిక్రమ్‌తో విరామం వెనక అసలు కారణం ఇదే!
ఈ మార్పుపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ, థమన్ స్వయంగా క్లారిటీ ఇచ్చి రూమర్లకు ‘చెక్’ పెట్టేశారు."త్రివిక్రమ్ సార్ ఈ సినిమా కోసం ఒక కొత్త టీంతో, కొత్త సౌండింగ్‌తో పని చేయాలని భావించారు. . అందుకే మేమిద్దరం చర్చించుకుని ఈ విరామం తీసుకున్నాం" అని థమన్ స్పష్టం చేశారు . . . ‘యానిమల్’ సినిమాతో నేషనల్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్, వెంకటేష్ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. .
అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీరిద్దరి అసలైన వేట ఇంకా బాకీ ఉంది. త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘గాడ్ ఆఫ్ వార్’ కోసం ఈ క్రేజీ కాంబో మళ్ళీ చేతులు కలుపుతోంది . . .త్రివిక్రమ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది . . . ఈ మెగా ప్రాజెక్ట్‌కు థమనే సంగీతం అందిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అంటే మళ్ళీ థియేటర్లలో సౌండ్ బాక్సులు పేలిపోయే ఆల్బమ్ రాబోతుందన్నమాట . .!