‘విశ్వంభర’ కోసం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..!
సినిమా రిలీజ్ డేట్ గురించి రకరకాల వార్తలు వస్తున్నా, జూలై నెలపై మెగా టీమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్లో ఆల్ టైమ్ హిట్ ‘ఇంద్ర’ జూలై 24నే విడుదలై రికార్డులు సృష్టించింది. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత అదే తేదీన లేదా జూలై 9 న ‘విశ్వంభర’ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్గా జరిగిన మీడియా భేటీలో చిరంజీవి స్వయంగా మాట్లాడుతూ.. సినిమా జూలైలో వచ్చే అవకాశం ఉందని, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదని వీఎఫ్ఎక్స్ టీమ్‌కు సూచించినట్లు తెలిపారు.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.ఈ సినిమాలో దాదాపు 5,000 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, సెకండాఫ్ మొత్తం గ్రాఫిక్స్‌తోనే నడుస్తుందని సమాచారం. అందుకే టాప్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నాయి.దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతున్నా, అవుట్‌పుట్ అదిరిపోవాలనే ఉద్దేశంతో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కోట్లు ఖర్చు చేస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఒక ‘మ్యాజికల్’ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని ట్రేడ్ వర్గాలు