ఆనియన్ చీజీ రింగ్స్ ని ఎప్పుడైనా తిన్నారా..?
ముందుగా "ఆనియన్ చీజీ రింగ్స్" కి కావాల్సిన పదార్ధాలు:
ఆనియన్-4,
మోజారిల్లా చీజ్-కొద్దిగ,
ఎగ్స్-4,
బ్రెడ్ క్రమ్స్-కొద్దిగ,
మైదా-కొద్దిగ,
నూనె-డీప్ ఫ్రైకి సరిపడా,
"ఆనియన్ చీజీ రింగ్స్"తయారు చేసే విధానం:
ముందుగా ఉల్లిపాయలను పొట్టు తీసి వాటిని గుండ్రంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మోజారిల్లా చీజ్ తీసుకుని సన్నగ పొడగ్గా కట్ చేసుకోవాలి. ముందుగా గుండ్రంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకుని వాటిని వేరు చేసి, ముందు పెద్ద ఉల్లిపాయ రింగ్ పెట్టి దానిలో చిన్న ఉల్లిపాయ రింగ్ ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వాటి రెండిటి మధ్యలో మోజారిల్లా చీజ్ ని పెట్టుకుని ఒక గంట ఫ్రిజ్ లో ఉంచాలి.
ఇప్పుడు గుడ్లను ఒక గిన్నెలో పగల గొట్టి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో బ్రెడ్ క్రమ్స్ ను ఇంకొక దాంట్లో మైదాని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. గంట తరువాత ఉల్లిపాయ రింగ్స్ ని ఫ్రిజ్ లో నుంచి తీసి, మొదట మైదాలో ముంచుకోవాలి. తరువాత గుడ్డు మిశ్రమంలో ముంచుకోవాలి. తరువాత మళ్లీ బ్రెడ్ క్రమ్స్ లో ముంచుకోవాలి. మళ్లీ గుడ్డు మిశ్రమంలో ముంచుకుని మళ్లీ దాని బ్రెడ్ క్రమ్స్ లో ముంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి, ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి, నూనె వేడి అయ్యాక మనం చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంతవరుకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన "ఆనియన్ చీజీ రింగ్స్" రెడీ