దసరా పండుగకు పసందైన వంటకాలు - కొబ్బరి బొబ్బట్లు

Edari Rama Krishna

కావలసినవి: కొబ్బరికోరు-3కప్పులు, బెల్లం-ఒకటిన్నర కప్పు వేయించిన శనగపప్పు-అరకప్పు, నెయ్యి-ఒక స్పూన్‌, యాలకులు-4 తయారుచేసే విధానం: కొబ్బరికోరుతో బెల్లం, యాలకులు చేర్చి రోటిలోనో, మిక్సీలోనో నీరు చేర్చకుండా పొడిచేయాలి. మందపాటి అడుగు గల పాత్రలో నెయ్యి వేసి పొడిచేసిన కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి.


తర్వాత స్టౌ మీద నుండి దించి వేయించిన శనగపప్పు పొడిని వేసి బాగా కలిపి ఆరబెట్టాలి. తర్వాత నిమ్మకాయంత సైజులలో పిండిని గుండ్రంగా పూర్ణాలు చేసుకోవాలి.  

ముందుగా మైదాపిండిలో నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి రెండు గంటలు నాననివ్వాలి.

తరువాత కొబ్బరి, బెల్లం తురుముకొని, రెండింటినీ ఒక గిన్నెలో వేసి ఉడికించాలి.

కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగపాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి.

ఇప్పుడు ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి.

నానబెట్టిన మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కోదాన్ని చిన్న పూరీలా ఒత్తి, అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి.

వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: