బీన్స్ పొరియల్

Durga
కావలసిన పదార్థాలు: బీన్స్ : 25 గ్రా.లు  శనగపప్పు : 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు :2 కొబ్బరి తురుము:  పావు కప్పు ఉల్లిగడ్డ: 1 మినపప్పు : 1 టీ స్పూన్ ఆవాలు : 1 టీ స్పూన్ కరివేపాకు : 2 రెమ్మలు కొత్తిమీర : ఒక కట్ట పసుపు- ఉప్పు్- నూనె: తగినంత  తయారు చేసే విధానం: బీన్స్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలను వేయాలి. దీంట్లో పసుపు, ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. రెండు నిమిషాలు ఆగి ఉడికించిన బీన్స్ ముక్కలను వేసి బాగా వేగాక కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి. కొత్తిమీర వేసి మరికాసేపు అలాగే ఉంచాలి. వేడి.. వేడి బీన్స్ పొరియల్ మీ ముందుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: