విజయం మీదే: తక్కువ పెట్టుబడితో కొన్ని వ్యాపారాలు

VAMSI
వ్యాపారాలు అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ అందరూ దైర్యం చేసి దిగలేరు. ఎందుకంటే ఇక్కడ లాభాలకు
ఎంత అవకాశం ఉంటుందో  నష్టాలకు కూడా అంతే స్కోప్ ఉంటుంది. ఏమాత్రం కొంచం అటు ఇటు అయినా నష్టాల బాధ  తప్పదు. అయితే వ్యాపారం లోని మెళుకువలు తెలుసుకుని దిగితే మాత్రం లాభాల బాట పట్టొచ్చు. ఒక‌ప్పుడు అయితే వ్యాపారం నిర్వహించాలి అంటే నైపుణ్యం త‌ప్ప‌నిస‌రి. కానీ ఇప్పుడు రోజులు మారాయి నైపుణ్యం క‌న్నా కూడా ఎక్కువగా టెక్నాలజీకే ప్రాముఖ్యత ఆదరణ లభిస్తోంది అని చెప్పాలి. మనసులో ఉన్న వినూత్న ఆలోచనలకు ఆచరణ రూపం ఇస్తే చాలు వ్యాపార సామ్రాజ్యాలనే సృష్టిస్తున్న వారు ఎందరో ఉన్నారు.  విజయవంతంగా వారి వారి వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా అనుసంధానం అవడంతో గల్లి లోనే కాదు ప్రపంచం వ్యాప్తంగా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.  కొనుగోళ్లు, అమ్మకాలు, సేవలు అందించడం గురించిన సమాచారం అలాగే సేవలు అందించడం ఇచ్చి పుచ్చుకోవడం వంటివి చాలా సులభతరంగా మారిపోయాయి. పెట్టుబడి తక్కువగా ఉంది అన్నది అసలు సబ్జెక్ట్ కాదు ఎన్నో స్టార్టప్ వ్యాపారాల‌ ఖర్చు రూ. 10 వేల కంటే తక్కువగా ఉంటున్న‌దంటే అర్దం చేసుకోవచ్చు. అందుకు తగినంత ఉత్సాహం, స‌రైన ప్లానింగ్ అందుకు తగ్గ బిజినెస్ వాతావరణం క్రియేట్ చేసుకోగలిగితే చాలు ఎలాంటి వ్యాపారాలు చేసేందుకైనా పుష్క‌లంగా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం.
అయితే తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గరి నుంచే చేసేందుకు అనువైన కొన్ని వ్యాపారాల గురించి కాస్త తెలుసుకుందాం పదండి. హ్యాండ్‌మేడ్‌ బహుమతులు, స్టేషనరీ వంటి కళాత్మకత కనుక మీలో ఉంటే మీరు ఆఫ్‌లైన్ ద్వారానే కాదు, ఆన్‌లైన్ ద్వారా మీ ప్రతిభను వినియోగించుకుని సంపాదించవచ్చు. ఇంట్లో తయారు చేసిన సబ్బులు, కొవ్వొత్తుల నుంచి పెన్సిల్స్, నోట్‌బుక్స్ వరకూ చాలా హ్యాండేమేడ్ వ‌స్తువుల‌కు బయట మంచి డిమాండ్ ఉంది. ఇటువంటి అనేక  ప్రొడక్టులను సొంతంగా త‌యారు చేసి విక్రయిస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. అలగే వీటి ఉత్పత్తికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు.  వాటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద పెద్ద సైట్లలో అమ్మకానికి పెట్టి లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: