విజయం మీదే: ఈ అలవాట్లు వదిలేస్తే ?

VAMSI
ప్రతి మనిషికి పెరుగుతున్న వాతావరణం బట్టి, కుటుంబం లోని పరిస్థితులను బట్టి మరియు స్వతహాగా కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. అయితే వాటిలో కొన్ని మంచివి, చెడు రెండు ఉండవచ్చు. వాటిని గుర్తించి చెడు అలవాట్లను దూరం పెట్టకపోతే మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అయితే అలవాట్లను మానుకోవడం , వదులుకోవడం అన్నది అంత సులువైన పని కాదు. కానీ కొంచం కష్టమైనా చెడు అలవాట్లను దూరం చేసుకోకపోతే భవిష్యత్తులో వాటి వలన మనకు సమస్యలు తప్పవు. అన్ని మనం సులువుగా పరిష్కరించుకొనే స్థాయిలో ఉండకపోవచ్చు. అయితే అంత ఇబ్బంది పడే దానికన్నా ముందుగానే గ్రహించి చెడు అలవాట్లను మానుకోవడం మంచిది.
కొంతమంది ఇది చాలా చిన్న అలవాటు దీని వలన పెద్దగా ఇబ్బంది ఉండదులే అని చాలా సులువుగా తీసుకుంటారు. కానీ చిన్నదైన, పెద్దది అయినా చెడు అలవాట్లు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. వాటి వలన సమస్య వచ్చి పైనే పడితే కానీ వాటి లోతెంతో తెలియదు. అందుకే చెడు అలవాటు అయినా చెడు స్నేహమైనా... రెండు కూడా ప్రమాదమే. ఇపుడు కాకపోతే మరోసారి అయినా అవి మన జీవితాలు నాశనం అయ్యేలా చేస్తాయి.  అందుకే ముందు చూపు అవసరం పెద్దల మాట విని జ్ఞానం తెచ్చుకుని స్పృహతో నిర్ణయాన్ని తీసుకోవాలి. మన వారు ఇది మంచిది కాదు అని చెబుతున్నారు అంటే ఆ అలవాటు లేదా పని మనకు మంచి చేయదనే కదా అర్దం. బయట వారి సంగతి పక్కన పెడితే కనీసం మన కుటుంబ సభ్యులు, మన మంచి కోరుకునే సన్నిహితులు మాట అయినా విని మీలోని చెడు అలవాట్లను , చెడు లక్షణాలను వీలయినంత త్వరగా దూరం చేసుకోండి.
కొందరయితే చిన్న విషయానికి, పెద్ద విషయానికి అబద్ధాలు చెబుతుంటారు. ఇది  పెద్ద పొరపాటు కాదులే అవతలి వారు మన అబద్దాల కారణంగా కష్టాల్లో మునిగిపోరులే... జస్ట్ మన సౌకర్యం కోసం ఏదో చిన్న అబద్ధం అని తమకు తామే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. కానీ అదే అలవాటుగా మారి అబద్దాలు చెప్పడం అబద్దాలు చెప్పడం పరిపాటి అయితే అని అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంది. అప్పుడు తల పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. అందుకే ఏదైనా సరే శృతి మించిపోకుండా చూడాలి. మొక్కగా ఉన్నప్పుడే ఆ చెడు అలవాట్లను మన నుంచి తొలగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: