విజయం మీదే: అన్నింటినీ శాసిస్తున్న "డబ్బును" ఎలా వాడాలో తెలుసుకోండి ?

VAMSI
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లక్ష్యం కోసమే పోరాడుతుంటారు. అయితే ఈ పోరాటంలో కొందరు సక్సెస్ అవ్వొచ్చు ? మరి కొందరు ఫెయిల్యూర్ అవ్వొచ్చు ? కానీ ఏదో ఒకటి తప్పక స్దధిస్తారు. అయితే లైఫ్ లో అనుకున్నది సాధించాలి అంటే ఈ నాలుగు విషయాలను గుర్తుంచుకోవాలి అలాగే పాటించాలి అని చెబుతున్నారు అనుభవజ్ఞులు. ప్రస్తుత కాలంలో ఏది చేయాలి అన్నా డబ్బు లేనిదే కుదరడం లేదు, ఈ విషయం అందరికీ తెలిసిందే. చాలా వరకు అన్ని విషయాలను ఈ డబ్బు కంట్రోల్ చేస్తుంది అన్నది తప్పక ఒప్పుకోవాల్సిన నిజం. అయితే అదే డబ్బుకి మనం ఎంత విలువ ఇస్తున్నాము, ఎలాంటి విలువ ఇస్తున్నాం అన్నది చాలా ముఖ్యం.
చాలా మందికి ఒక్కో రూపాయిని ఎంతో కష్టపడి సంపాదించాల్సిన పరిస్థితి, అలాంటిది అదే రూపాయిని ఖర్చు చేయడానికి అస్సలు ఆలోచించకుండా చాలా ఈజీగా ఖర్చు చేసేస్తున్నారు.  సంపాదిస్తోంది ఖర్చు చేయడానికే కానీ, వృదా చేయడానికి కాదు. నీవు ఫలానా దానికి నీ డబ్బులను వెచ్చిస్తున్నావు అంటే, ఆ వస్తువు లేదా పని నీకు చాలా ఉపయోగకరమైనదిగా ఉండాలి, లేదంటే వృధానే, కళ్ళు చూసిన ప్రతీది మనసుకు నచ్చవచ్చు తప్పులేదు కానీ నచ్చిన ప్రతి దాన్ని కొనాలి అనే ఆలోచన రావడం పొరపాటు. నీవు ఖర్చు చేసే ప్రతి రూపాయి నీకు ఉపయోగకరంగా మారాలి.
ఉదాహరణకు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి అని లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దృష్టి అంతా దాని పైనే ఉండాలి. అలా కాకుండా షాపింగ్ అని, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లని డబ్బులను వృదా చేస్తే ఆ కల ఎప్పటికీ కల గానే మొగిలిపోతుంది. అందుకే డబ్బును వృదా గా ఖర్చు చేయకండి. అలాగే మనుషుల కంటే డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: