విజయం మీదే: ఎంత కష్టపడినా లక్ష్యాన్ని అందుకోలేకున్నారా?

VAMSI
ఈ లోకంలో అందరూ ఎంతో కష్టపడి అనుకున్న పనిని సాధించాలి అని కళలు కంటారు. అయితే వారిలో కొద్ది మంది మాత్రమే అనుకున్నది సాధిస్తారు. చాలా వరకు ఫైయిల్యూర్ అవుతారు. అయితే కొన్ని సార్లు కష్టంతో పాటుగా విజయం అందుకోవాలి అంటే ఆ దేవుని అనుగ్రహం కూడా ఉండాలి. కొన్ని సార్లు మన జీవితంలో శని ప్రభావం వలన ఏ పని తలపెట్టినా .. ఎంత పట్టుదలతో కృషి చేసినా... అస్సలు కలిసి రాదు, అనుకున్న కార్యం నెరవేరదు. ఆమడ దూరంలో లక్ష్యం కనిపిస్తున్నా అనుకోని రీతిలో అనంతమైన సమస్యలు చుట్టు ముట్టేస్తాయి. అలా శని ప్రభావం వలన అడ్డంకులు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. అయితే శని దోషం పోయి అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ? అదే విధంగా మీరు విజయాలను అందుకోవాలి అంటే ? శని పూజ చేసి ఆ శనీశ్వరుడుని శాంతింప చేయడమే సరైన మార్గమని చెబుతున్నారు.
అయితే హనుమాన్ జయంతి రోజున చేసే శని పూజకు ప్రత్యేకమైన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. శని దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఏం చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హనుమాన్ జయంతి రోజున... అనగా శనివారం సంధ్యా సమయంలో ఆ హనుమంతుని ఆలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. అది కూడా దీపారాధనకు ఆవ నూనెను మాత్రమే వినియోగించాలి. దీపారాధన తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఆ ఆంజనేయుని అనుగ్రహంతో శని ప్రభావం తగ్గుతుంది. అదే విధంగా గులాబీ పువ్వులతో కూడిన పూల మాలను మరియు తమలపాకుతో కూడిన మాలను హనుమంతునికి సమర్పించాలి. ఇలా చేయడం వలన శని గ్రహ ప్రభావం నుండి విముక్తి దొరుకుతుందని పండితులు చెబుతున్నారు.
అలాగే హనుమంతుని అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. పైన చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే అనుకున్నవి అన్నీ నెరవేరుతాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: