విజయం మీదే: "అన్నీ తెలుసన్న గర్వమా"... అయితే ఇది తెలుసుకోండి?

VAMSI
జీవితం నేర్పించే పాఠాలను తక్కువ చేసి చూస్తున్నారా? అయితే చేతులారా మీ సక్సెస్ ను మీరే దూరం చేసుకున్నట్లే. విద్యను నేర్చుకోవడం అందరికీ అవసరం, అలాగే సందర్భానుసారంగా జీవితం నేర్పే పాఠాలు కూడా మనిషికి ఎంతో అమూల్యమైనవి. మనిషి నిరంతర విద్యార్థి అన్నారు మహానుభావులు. అది నిజమే ఎంత నేర్చుకున్నా, మరెంత తెలుసుకున్నా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఎంతో ఉంటుంది అనేది అక్షర సత్యం. నాకు అన్నీ తెలుసు అనుకుని గర్వంతో ఊగిపోరాదు. అలాగే జీవన పయనంలో ఎదురయ్యే అనుభవాలను తక్కువ చేసి చూడరాదు. ఇవి రెండు ప్రమాదమే, సమస్యలకు మూలకారణమే.
ఉదాహరణకు ఒక వ్యక్తి మహా మేధావి మహాపండితుడు. సకల విద్యల్లోనూ, నైపుణ్యాలను ఆరితేరాడు. ఎటువంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం చెప్పగలను, ఎటువంటి సమస్యకైనా వెంటనే పరిష్కారం చూపగలను అని అతడి పై అతడికి అపారమైన నమ్మకం. అదే విశ్వాసంతో అందరి ముందు తనని గురించి తాను గొప్పగా చెప్పుకుంటుంటారు, అలాగే అందరూ తన ప్రతిభ గురించి మేధస్సు గురించి మాట్లాడుకోవాలి అని తాపత్రయపడుతుంటాడు. అయితే ఒకరోజు అతను ఒక సభకు వెళ్ళారు. ఆ సభలో ఎందరో మేదావులు అడిగే ప్రశ్నలకు అవలీలగా సమాధానం చెప్పేస్తున్నారు.
అయితే ఇంతలో ఒక చిన్న పాప వచ్చి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా ? మీరు సమాధానం చెబుతారా అని అడిగింది ? అందుకు అతడు చిన్న పాపవు నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేనా? అడుగు అంటూ నవ్వాడు. అపుడు ఆ పాప ఒక చిన్న పొడుపు కథను చెప్పి విప్పమంది. కానీ ఆ పొడుపు కథ గురించి అతడికి తెలియక పోవడంతో సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో అతడికి తెలిసొచ్చింది. నాకు అన్నీ తెలుసు అనుకోవడం అవివేకం అని. నేను మేధావిని అయి ఉండొచ్చు, ఎన్నో అంశాలను అవపోసన పట్టిఉండొచ్చు. కానీ తెలియని విషయాలు మరియు నేర్చుకోని అంశాలు చాలానే ఉంటాయి అని రియలైజ్ అయ్యాడు. అదే విధంగా జీవితంలో ఇపుడు తనకు ఎదురయిన ఈ అనుభవం నుండి ఒక నిజాన్ని, విషయాన్ని గ్రహించగలిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: