విజయం మీదే: మీ పిల్లలకు ఈ 2 అలవాట్లు నేర్పితే చాలు?

VAMSI
అందరికీ ఒకే మార్గం విజయం తెచ్చిపెడుతుంది అనుకుంటే పొరపాటే. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం, కొందరికి లక్ష్యం ఒకటే అయినా వాటిని చేరుకోవడానికి వెళ్ళే దారులు ఒకటై ఉండొచ్చు లేదా వేరై కూడా ఉండొచ్చు. ఒకరితో మరొకరిని పోల్చి చూడటం కరెక్ట్ కాదు. ఒకరిని చూసి స్ఫూర్తి పొందవచ్చును కానీ వారి లాగా అనుకరిస్తే మనకు కూడా ఖచ్చితంగా విజయం అందుతుంది అనుకోవడం మాత్రం సమంజసం కాదు. అన్ని వేళలా అలా కుదరకపోవచ్చు. కానీ చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోలుస్తూ అదిగో వారిలా అంతా సేపు చదవాలి, నలుగంటలకే లేచి బట్టి పట్టాలి. ఇలా చాలానే చెబుతుంటారు.
కానీ ఇది పిల్లల మానసిక స్థితిపై ఎంత ఒత్తిడిని పెంచుతుంది అన్నది చాలా మంది అర్దం  చేసుకోవడం లేదు. అయితే ఆలా చేయడం వారి భవిష్యత్తుకు మంచిదే అయినా వీలైనంత వరకు మీ పిల్లలకు అర్థం అయ్యేలా విషయాన్ని చెప్పడం వలన ఉపయోగం ఉంటుంది అని గ్రహించండి. మీ పిల్లలు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏ విధంగా మీ పిల్లలకు భవిష్యత్తు కు ఉపయోగపడే రెండు సలహాలు ఇవ్వండి. అలాగే వాటిని పాటించేలా కొన్ని రోజులు కష్టపడండి.
ఉదయం నిద్ర త్వరగా లేవాలి అని చెబుతూనే ఇలా చెస్తే మంచి ఆరోగ్యంతో పాటుగా మంచి అలవాట్లు ఏర్పడుతాయి. మీ రోజు మొదలయ్యేది ఉదయం తోనే కాబట్టి ఉదయం త్వరగా లేస్తే ఆ రోజు అంతా మీకు మంచిగా జరుగుతుంది అని చెప్పాలి. లేచిన తర్వాత బుక్స్ చదవడం అలవాటు చెయ్యాలి. ఇది చాలా మంచి అలవాటుగా పరిగణించబడుతుంది. ఉదయం పిల్లలు చదివితే అలాగే గుర్తుండిపోతుంది. ఇక చదవడం మీరు చెప్పగలిగితే ఇక మీ పిల్లలు ప్రతిరోజూ ఈ రెండు అలవాట్లు కరెక్ట్ గా పాటించ గలిగితే ఇవే మీ పిల్లల బాగారు భవిష్యత్తుకు పునాదులుగా నిలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: