విజయం మీదే: విద్యతోనే విజయం సాధ్యమా?

VAMSI
నేటి మానవుని జీవితంలో విద్య అనేది ఒక ప్రముఖ అధ్యాయం అనే చెప్పాలి. చిన్న విషయం నుండి పెద్ద అంశం వరకు అన్ని చోట్ల విద్య ఏదో రకంగా మనకు అవసరం అవుతుంది. చదువు మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ జ్ఞానం మనకు మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి, జీవితంలో అవరోధాలను తొలగించుకుని ముందుకు సాగడానికి ఎంతగానో సహాయపడుతుంది. చాలా సందర్భాల్లో జరిగేది ఏమిటంటే విజయం అందుకోవాలి అంటే కావాల్సిన అంశాల్లో విద్య కూడా ఒకటని చెప్పొచ్చు అయితే ఖచ్చితంగా అవసరం అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఒక్క అక్షరం ముక్క రాని వారు ఎందరో ఈ సమాజాన్ని శాసిస్తున్నారు.
అయితే విద్య ఉండకపోతే విజయం దక్కుతుంది అనడానికి కొన్ని అవకాశాలే ఉంటాయి. అదే విద్య ఉండి అందుకు తోడుగా మీ కృషి, పట్టుదల తోడైతే  విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. విద్య మనకు జ్ఞాన సముపార్జనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నలుగురితో ఎలా మెలగాలి, సమాజంలో మన స్థానం ఏమిటి, నీ యొక్క ప్రత్యేకత ఏమిటి ఇలా ఎన్నిటికో సొల్యూషన్ గా మారుతుంది. అందుకే మన బాల్యం నుండి ఒక వయస్సు వరకు చదువు మీదనే మీ దృష్టిని కేంద్రీకరించాలి. అలా కాకుండా వివిధ చేదు అలవాట్లకు బానిసలుగా మారిపోతే, మొదట చదువు పాడవుతుంది, ఆ తర్వాత మీరు కూడా ఎందుకు కొరగాకుండా పోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే ఇక్కడ మొదట మనము చెప్పుకున్నట్లుగా విద్య ఉంటేనే విజయం మనకు దక్కుతుందా అంటే కాదు. కానీ కొంత వరకు అయితే విద్య అవసరం ఉంటుంది. అక్షరం ముక్క రాణి వాళ్ళు కూడా కోట్లకు అధిపతి అవుతున్నారు అంటే, దానికి వారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయినా దాదాపుగా అన్ని సందర్భాలలో చదువు తెలిసినవాడు మీదనే ఆధారపడి ఉంటాడు. అదే మనకే చదువు తెలిస్తే అద్భుతంగా ఉంటుంది. అందుకే చదువుకు పెద్ద పీట వేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: