విజయం మీదే: ఏది చేసినా మీ కోసమే... ఇది ఫిక్స్

VAMSI
మనకు ఉన్న ఈ చిన్న జీవితంలో మన సంతోషం, తృప్తి కోసం ఆలోచించుకునే రోజులు ఎప్పుడూ పోయాయి. ఏ పని చేసినా అన్నీ కూడా ఎదుటి వారి మెప్పు పొందడానికో, లేదా వారిని తృప్తి పరచడానికో, లేదా సంతోష పెట్టడానికి మాత్రమే చేస్తున్నాము. ఇది సత్యం, అబద్దం అని ఎవ్వరూ కాదనలేరు. ఇది వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా జరుగుతుంది. ఒక సాధారణ కూలి తన యజమానిని సంతృప్తి పరచడానికి పని చేయడం కన్నా ఎక్కువగా నటిస్తూ ఉంటాడు. అదే ఒక చిన్న చిరుద్యోగి తన బాస్ దగ్గర మంచి పేరు కోసం తన సంతోషాలను దిగమింగుకుని అతన్ని సంతోషపెడుతాడు. అదే ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి అయితే ప్రమోషన్ కోసం సీఈఓ ను కాకా పెట్టడానికి తనను ఏదో ఒక విధంగా ఎంటర్ టైన్ చేస్తాడు.
ఇలా వ్యక్తిగతంగా మన సంతోషాలను చంపేసుకుంటున్నాము. అయితే ఇలా చేయడం వలన ఎప్పుడో మీకు కలిగే ప్రతిఫలం కోసం ఎక్కువ సమయం బాధను, దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇది సరైనది కాదు అని ఎందరో మహానుభావులు చెప్పారు.  ఎక్కడో చాలా తక్కువ మందిలో మాత్రమే ఏది చేసినా తమ కోసం, తమ తృప్తి కోసం మరియు సంతోషం కోసం చేస్తారు. అందులోనే నిజమైన ఆనందం ఉంటుంది. కాబట్టి ఇతరుల మెప్పు కోసం ఇలా చేయకండి.
మీ లైఫ్ లో నిజమైన విజయం మీరు పొందాలంటే... మీరు ఎప్పుడూ మీలానే ఉండాలి. మీకు ప్రతికూలంగా వచ్చే ప్రతి పరిస్థితులకు భిన్నంగా, వాటికి శత్రువులా ఆలోచించాలి. రేపటి నుండి మీ లైఫ్ నిన్నటి వరకు ఎలా ఉంది. ఇప్పటి నుండి ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? ఎవరి కోసం మనం కష్టపడాలి? అన్న పలు కీలకమైన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ వెళ్ళండి. విజయం మీకు ఆ దారిలోనే దొరుకుతుంది. అదే నిజమైన విజయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: