విజయం మీదే: మీ లక్ష్యంపై దృష్టి నిలపండి... లేదంటే అంతే?

VAMSI
ఒక వ్యక్తి తన జీవితంలో ఫలానా సాధించాలి అంటే అది ఖచ్చితంగా సాదించాలి అనే పట్టుదల తోనే ముందుకు సాగాలి. అంతే తప్ప మద్యలో వచ్చే అవాంతరాలకో లేక ఓటమికో భయపడి ఆగిపోకూడదు. అవే మీ లక్ష్యానికి మీకు అసలైన శత్రువులు అవుతాయి. వాటిని ఎప్పుడైతే దైర్యంగా పాజిటివ్ గా స్వీకరించి ముందుకు సాగి మళ్ళీ మన ప్రయత్నాన్ని కొనసాగిస్తామో అప్పుడే విజయాన్ని అందుకోగలము.
ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది చాలా మంది జీవితాల్లో జరిగేదే. ఒక వ్యక్తి టీచర్ జాబ్ కోసం కావలసిన అర్హతను బాగా కష్టపడి చదివి సంపాదించుకున్నాడు. ఎంతో కష్టపడి చదివారు అయితే చదువు అయ్యాక సదరు టీచర్ జాబ్ కోసం ప్రయత్నించారు. కానీ మొదటి సారి అనుకున్న ఫలితం అందలేదు. మళ్ళీ రెండు మూడు సార్లు కూడా అదే జరిగింది, ఓటమే ఎదురయ్యింది. అయిన వాళ్ళు, కానివాళ్లు, తెలిసిన వాళ్ళు, తెలియని వారు అందరూ టీచర్ జాబ్ ను సంపాదించడం అంత సులభం కాదు, నీకు అంత సులువుగా దక్కదు, ప్రయత్నించడం వృదా ఎందుకు సమయాన్ని వృదా చేసుకుంటావు అని అంతా అనడం మొదలు పెట్టారు.
అందుకు బదులుగా ఇంకేదైనా ప్రైవేట్ గా చేసుకునా మంచి జరుగుతుంది అని పలు రకాలుగా చెప్పేవారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎవరి మాటలను పట్టించుకోలేదు, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చివరి వరకు ప్రయత్నించాలి అని, మద్యలో వదిలి మళ్ళీ ఇంకేదైనా కొత్తగా ప్రారంభించడం వృదా అని అనుకుని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సాధనలో ఇంకా పట్టు పెంచుకుంటూ ప్రయత్నిస్తూ వచ్చారు, అలా చివరికి తను అనుకున్నది సాధించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇతని విజయాన్ని తెలుసుకున్న వారు ఆ తర్వాత తన వద్దకు వచ్చి మెచ్చుకున్నారు. తనను ఎంతగానో పొగిడారు. చూశారా... ఆ రోజు ఈ వ్యక్తులే ఇక వద్దు నీ ప్రయత్నం ఆపేసి వేరే జాబ్ చూసుకో అన్నారు. కానీ ఆ వ్యక్తి వారి మాటలు ఏమీ పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యం పట్ల గట్టిగ ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. అందుకే ఏది అనుకుంటే దానిపై గట్టిగా శ్రమించాలి అప్పుడే దాని విలువ అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: