విజయం మీదే: డబ్బే జీవితం కాదు... కాకూడదు

VAMSI
నేటి సమాజంలో ప్రజలు అంతా ఒకరకమైన ఫీలింగ్ లో బ్రతుకుతున్నారు. ఇది మనము ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో చూస్తూనే ఉన్నాము. వంచేందుకు తగ్గట్టు ప్రస్తుత జీవన విధానం ఎంతగానో మారింది. చాలా వరకు అందరూ ధనాన్ని సంపాదించేందుకు పరుగులు తీసే వారే. ఈ ప్రయాణంలో మనతో ముడిపడి ఉన్న ఎన్నో బంధాలను పక్కన పెట్టేస్తున్నారు, వారికంటూ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కొందరైతే ఇలా అందరి కోసం టైం ను ఇస్తూ పోతే చాలా నష్టం అని ఫీల్ అయ్యే వాళ్లు కూడా ఉన్నారు.
ఈ విధంగా బాధ్యతలను సైతం పక్కన పెట్టి డబ్బు సంపాదించాలనే తాపత్రయం పడుతున్నారు. కానీ కుటుంబాన్ని పోషించడానికి, తమకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి,  డబ్బు అనే మత్తులో పడి సాగే ఈ ప్రయాణంలో వారు ఏమి కోల్పోతున్నారో అన్నది చాలా మందికి తలియడం లేదు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసింది డబ్బు మాత్రమే జీవితం కాకూడదు, డబ్బు సంపాదించడమే వారి లక్ష్యంగా మారకూడదు. ధన దాహం అనేది అంత సులభంగా తీరేది కాదు. మీకు ఎంత దానం ఉన్నప్పటికీ సంతృప్తి పడరు. మన దగ్గర ఉన్న డబ్బు చాలు అన్న భావన ఎన్నటికీ కలగదు.
ఎంత ఉన్న ఇంకా కావాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. బ్రతకడానికి ధనం కావాలి వాస్తవమే, కానీ ధనం మాత్రమే జీవితం కాదు. మన కనీస అవసరాలు తీర్చడానికి, మన కుటుంబాన్ని సౌకర్యవంతంగా  నడిపించడానికి సరిపడా డబ్బు ఉంటే చాలు. అలా కాకుండా లగ్జరీగా బ్రతకాలన్న చాలా మంది కోరికల మూలంగా జీవితంలో ఎన్నో విలువైన వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా మేల్కోండి. డబ్బు కన్నా విలువైనవి డబ్బుతో కొనలేనివి చాలా బంధాలు విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: