విజయం మీదే: నీకు ఇష్టం ఉంటేనే ఏదైనా చెయ్యి?

VAMSI
జీవితమనే పయనంలో ఎన్నో మలుపులు వస్తుంటాయి. అన్నిటినీ అధిగమిస్తూ మనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగాలి. కొన్ని సార్లు మన గమ్యాన్ని మార్చుకోవాల్సిన సందర్భం కూడా వస్తుంది. కోరుకున్న విజయం అందుకునే వరకు వెను తిరగకూడదని, అనుకున్నది సాధించే వరకు అస్సలు ఆగకూడదని అంతా అంటుంటారు. కానీ ఇది అన్ని వేళలా సాద్యపడకపోవచ్చు, కొన్ని సార్లు కష్టపడుతూ ముందుకు వెళ్లడం కన్నా ఇష్టం లేని దారిలో నడవక పోవడమే మంచిదని కొందరు అనుభవజ్ఞులు అంటున్నారు. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ కాదు, కొన్ని ఖచ్చితమైన సందర్భాల్లో మాత్రం మీ పయణాన్ని మార్చుకోవాల్సిన లేదా ముంగించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
నువ్వు సాదించాలనుకున్నా లక్ష్యం నీకు సంతోషాన్ని కలిగించనపుడు నువ్వు ఎంత శ్రమించినా వృధా అవుతుంది. ఇలాంటి సందర్భంలో నీ గమ్యానికి చేరే ప్రయత్నం మధ్యలోనే విరమించుకోవడం మంచిది.  అదే విధంగా  నువ్వు ఎంచుకున్న మార్గం నీకు సరి కాదని నీ మనసు పదేపదే చెబుతున్నప్పుడు, బలంగా నీ మనసు వద్దు అని చెప్పినప్పుడు కూడా వెను తిరగడమే మంచిది. లేదంటే కష్టపడి కూడా ప్రయోజనం ఉండదు. ఏదేమైనా వీలైనంత వరకు ప్రయత్నం మొదలు పెట్టండి, పూర్తి చేయడానికి సాయశక్తులా కృషి చేయండి కానీ.. అసంతృప్తిగా మిగిల్చే విజయం ఎప్పటికీ కూడా సంతోషాన్ని ఇవ్వలేదు అనే విషయాన్ని అర్దం చేసుకోండి.

ఇక చాలా మంది ఉన్న కాస్త పనిని వదిలేస్తే తరువాత ఏం చేస్తాం, ఇంతకు మించి అన్న విషయాన్ని పక్కన పెడితే...అసలు కనీసం ఇలాంటి పని అయినా దొరుకుతుందా, మనము అడ్జస్ట్ కాగలమా అన్న అనుమానాలు చుట్టు ముట్టడంతో ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే దైర్యం చేస్తే కానీ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోలేము. అయితే కాస్త ముందు చూపుతో ఆలోచిస్తే...మీకు తగ్గ పని, మీరు అభివృద్ధిలోకి వచ్చే విజయావకాశం  మీకోసం ఉండనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: