విజయం మీదే: ఈ విషయాలు తెలుసా... మీకిక తిరుగులేదు?

VAMSI
విజయం అనేది సంతోషాన్ని ఇవ్వటమే కాదు. సమాజంలో మన గౌరవ మర్యాదలు కూడా పెరిగేలా చేస్తుంది. జీవితంపై భరోసా కల్పించి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ విజయం అందుకోవడం అంత సులభమా అంటే కాదు? అంత కష్టమా? అస్సలు సాధ్యపడదా? అంటే కానే కాదు. విజయం సొంతం చేసుకోవాలనే వారు కొన్ని విజయ సూత్రాలను తెలుసుకోవాలి. నిర్దిష్టమైన లక్ష్యం, దృఢమైన సంకల్పం, సమయ స్పూర్తి, సమస్యలను ఎదిరించి అధిగమించే నేర్పు, ముఖ్యంగా అనుభవజ్ఞుల సలహా లాంటి విషయాలను తెలుసుకుని ఆచరించాలి.
అనుభవ పాఠాల ద్వారా అభ్యాసం ద్వారా విజయ శిఖరాలను చేరుకున్న అనుభవజ్ఞుల సలహాలు అమృతం లాంటివి. వారి సలహాలను, సూచలనలను పాటించడం ఉత్తమం. ఇంతకీ ఎన్నో అనుభవాలను ఎదుర్కొని , ఎన్నో అభ్యాసాలతో విజయాలను అందుకున్న అనుభవజ్ఞుల చెబుతున్న బంగారు సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* సహనాన్ని కోల్పోయే వ్యక్తి ఎన్నటికీ విజయాన్ని అందుకోలేడు.  సహనం విజయానికి తొలిమెట్టు వంటిది. మొదటి మెట్టునే కష్టం అని ఆగిపోయేవాడు లక్ష్యం చివర వరకు చేరుకోలేడు.  
* భయం అనేది మనల్ని ఎప్పుడూ వెనక్కే లాగుతుంది. సమస్యలు ఎదురైనప్పుడు భయం మనలో ఉంటే అది మనల్ని పరిష్కారం వైపు అలోచించనివ్వదు మనసును పరిపరి విధాలుగా కంగారుపెడుతుంది. భయం ఎలా పోగొట్టుకోవాలి అంటే...ఏదైనా మీరు చేయగలరు అని దైర్యంగా ముందడుగు వేస్తే చాలు భయం దానంతట అదే మాయమవుతుంది.
* మనకు కలిగిన సమస్యను ఒక సవాలుగా భావించి పరిష్కరించడానికి పూర్తి ప్రయత్నం చేయాలి. మధ్యలోనే వదిలేయడమో లేదా సమస్యను చూసి పారిపోవడంతో చేస్తే మనము ఏమీ సాధించలేము.
* అన్నింటికన్నా చాలా ముఖ్యమైంది విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం లేదా ఓటమి కలిగినప్పుడు కుంగిపోవడమూ చేయకూడదు. ఈ ఒక్క లక్షణాన్ని మీరు పోగొట్టుకోగలిగితే చాలు. గెలుపు మరియు ఓటములను సమానంగా చూడగలిగితే చాలు మీరు ఎంతటి కష్టమైనా పరిస్థితి నుండి అయినా బయటపడగలరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: